Share News

అంబేడ్కర్‌పై 21 వారాల ప్రసంగాలు

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:14 AM

సామాజిక చలనాలను గుర్తించడం, వాటిని అవగాహనలోకి తెచ్చుకోవడం, సమాజ సాహిత్యాల పరస్పర ప్రమేయాలను విశ్లేషించుకోవడం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఆచరణలో ముఖ్యమైన అంశం...

అంబేడ్కర్‌పై 21 వారాల ప్రసంగాలు

సామాజిక చలనాలను గుర్తించడం, వాటిని అవగాహనలోకి తెచ్చుకోవడం, సమాజ సాహిత్యాల పరస్పర ప్రమేయాలను విశ్లేషించుకోవడం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఆచరణలో ముఖ్యమైన అంశం. గత పదహారేళ్లుగా వివిధ మార్గాలలో ఆ పని జరిగింది. ఇప్పుడు అంబేడ్కర్‌ ఆలోచనల అధ్యయనం కోసం ప్రరవే సంకల్పించింది. అంబేడ్కర్‌ ఆలోచనల ప్రతిఫలంగా మనకి మిగిలిన వేల పేజీల రచనలు, వందల గంటల ఉపన్యాసాల నుంచి, వర్తమాన ప్రాసంగికతను కూడా దృష్టిలో పెట్టుకుని, 38 ప్రసంగ అంశాలను రూపొందించాం. ప్రారంభ, ముగింపు సభల్లో నేపథ్య, సారాంశ ప్రసంగాలు పది. ఇలా మొత్తంగా 48 ఉపన్యాసాలను 21 వారాల్లో వినబోతున్నాం. ఆలోచనాపరులు, అధ్యయనశీలురు అయిన 48 మంది వక్తలు అంబేడ్కర్‌ ఆలోచనల మీద సమగ్ర అవగాహనని కలిగించి, కొత్త చూపుని ప్రసరించడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్‌ 22, 2024 నుంచి మే 18, 2025 వరకూ ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట దాకా అంతర్జాల మాధ్యమం ద్వారా ఈ అంబేడ్కర్‌ ఉపన్యాసాల సిరీస్ జరగనున్నది.


మిత్రులందరినీ ఈ పరంపరలో భాగం కమ్మని కోరుతున్నాము. ఈ ప్రసంగాల సిరీస్‌లో భాగంగా– అంబేడ్కర్‌ ప్రాసంగికత, అంబేడ్కర్‌ జీవితం – వ్యక్తిత్వం, ఆచరణశీలి అంబేడ్కర్‌, జాతీయోద్యమ ఘట్టాల్లో అంబేడ్కర్‌ ఆలోచనలు, పూనా ఒడంబడిక, రాజ్యాంగం – రాజ్యాంగ సంస్కరణలు- అంబేడ్కర్‌, అంబేడ్కర్‌ చిన్న రాష్ట్రాలు, ముస్లిం మైనార్టీల గురించి అంబేడ్కర్‌... తదితర అంశాలపై ప్రసంగాలు ఉంటాయి.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

Updated Date - Dec 20 , 2024 | 01:14 AM