Share News

ప్రాచీన గ్రంథాలను పరిరక్షించాలి

ABN , Publish Date - Nov 15 , 2024 | 02:01 AM

భారతీయ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం. ప్రాచీన తాళపత్రగ్రంథాలు నలంద, తక్షశిల తదితర విశ్వవిద్యాలయా లలో భద్రపరచబడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని...

ప్రాచీన గ్రంథాలను పరిరక్షించాలి

భారతీయ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం. ప్రాచీన తాళపత్రగ్రంథాలు నలంద, తక్షశిల తదితర విశ్వవిద్యాలయా లలో భద్రపరచబడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవమేధ చాలాసార్లు మాడి మసి బొగ్గయింది. నేపాల్ విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల అపురూప సంస్కృత గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలయ్యాయి. ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతులు ప్రచురణ సులభమైంది. గ్రంథస్థ విషయాలు ప్రపంచమంత విస్తృతం, ప్రపంచ వ్యాపితం అవుతున్నాయి. వేలాది అంశాలు, లక్షలాదిగ్రం థాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథంలోకి వెళితే, అది బాహ్య ప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతున్నది. అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారాలు.


గ్రంథాలయ వారోత్సవాల సంద ర్భంగా పఠనాసక్తిని పెంపొందించే కృషి జరగాలి. అలాగే అపూర్వ, అపురూప, అమూల్య ప్రాచీనగ్రం థాల పరిరక్షణపై బాల్యం నుండే పిల్లలకు అవగాహన కల్పించాలి.

రామకిష్టయ్య సంగనభట్ల

Updated Date - Nov 15 , 2024 | 02:01 AM