Share News

ప్రత్యర్థికి విరాళం!

ABN , Publish Date - May 04 , 2024 | 04:36 AM

అవి 1955 మధ్యంతర ఎన్నికలు ఆంధ్రాలో జరిగే రోజులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున....

ప్రత్యర్థికి విరాళం!

అవి 1955 మధ్యంతర ఎన్నికలు ఆంధ్రాలో జరిగే రోజులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున జవ్వాది లక్ష్మయ్య, కమ్యూనిస్టు పార్టీ తరఫున వంక సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. పోటీ హోరాహోరీగా సాగుతోంది. కమ్యూనిస్టు పార్టీ ఒక కారు సంపాదించి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోమని సత్యనారాయణకి పంపించింది. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు పెట్రోలుకు కూడా డబ్బులు లేని సత్యకాలం అది. సత్యనారాయణ తన ప్రత్యర్థి లక్ష్మయ్య దగ్గరకెళ్లి విషయం చెప్పి విరాళం అడిగారట. నాపై పోటీ చేస్తూ నన్ను విరాళం అడుగుతున్నావా? అంటే... అది మా పార్టీ నిర్ణయం సార్‌ అన్నారట సత్యనారాయణ. నీకు డబ్బులుగా ఇస్తే అల్లరవుతుంది కానీ నాకు మార్టేరులో పెట్రోల్‌ బంకు ఉంది. అక్కడ వెయ్యి రూపాయల పెట్రోలు ఉచితంగా కొట్టమని చెప్తాను, వెళ్లండి అని చెప్పారట లక్ష్మయ్య. ఎలక్షన్‌ కాలానికంతా ఆ పెట్రోలు సరిపోయిందని వంకా తన ఆత్మకథ తొమ్మిదిపదుల్లో రాసుకున్నారు.

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - May 04 , 2024 | 04:36 AM