Share News

‘‘ఈ సంకలనానికి 30 ఏళ్ళ భారతి పత్రికల్ని పరిశీలించాం’’

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:40 AM

కొన్ని సంవత్సరాల క్రితం, ‘తెలుగు జాతి మనది’ అనే శీర్షికతో ఒక టి.వి. సీరియల్‌ తీయాలని సంకల్పించాను. తెలుగు వారి జీవితాల్ని రకరకాల కోణాలనుండి ప్రేక్షకులకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా చూపించడం దాని ఉద్దేశ్యం...

‘‘ఈ సంకలనానికి 30 ఏళ్ళ  భారతి పత్రికల్ని పరిశీలించాం’’

వి.కె. ప్రేమ్‌చంద్‌ : పలకరింపు

వందేళ్ళ తెలుగు సాహిత్యం నుంచి ఏరిన వందమంది కవుల కవితలతో, పరిచయాలతో, విశ్లేషణలతో మీతోపాటు చేపూరు సుబ్బారావు సంపాదకత్వంలో ‘కవన గర్బరాలు’ పేరిట వెయ్యి పేజీల బృహత్‌ సంకలనాన్ని కూర్చారు. ఈ ఆలోచన ఎలా మొదలైందో చెప్తారా?

కొన్ని సంవత్సరాల క్రితం, ‘తెలుగు జాతి మనది’ అనే శీర్షికతో ఒక టి.వి. సీరియల్‌ తీయాలని సంకల్పించాను. తెలుగు వారి జీవితాల్ని రకరకాల కోణాలనుండి ప్రేక్షకులకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా చూపించడం దాని ఉద్దేశ్యం. ప్రతి ఎపిసోడ్‌లో 7 భాగాలుంటాయి. 6వ భాగం శీర్షిక పేరు ‘వెలకట్టలేని వారసత్వాలు, అలనాటి పద్యాలు, ఇలనాటి గేయాలు’. ఈ శీర్షిక క్రింద ప్రతి వారం తెలుగు సాహిత్యం లోని ఒక గొప్ప పద్యాన్ని, ఒక మంచి గేయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనేది నాకోరిక. అయితే సీరియల్‌ ఆలస్యమవుతుండటంతో, ఛందోరహిత కవితలను ఒక పుస్తకంగానూ, ఛందోసహిత కవితలను మరో పుస్తకంగానూ, తీసుకొస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాను. కాని సంకల్పించిన సంకలనాలు, మామూలుగా వచ్చే సంకలనాలకన్న భిన్నంగానూ, ఆసక్తికరంగానూ ఉండాలనుకున్నాను. ఛందోరహిత కవితలను ‘కవన గర్బరాలు’ అనీ, ఛందోసహిత కవితలను ‘వెయ్యేళ్ళ పద్యానికి వందనం’ అని నామకరణం చేశాం. ‘కవన గర్బరాలు’ మార్కెట్లోకి వచ్చింది. ‘వెయ్యేళ్ళ పద్యానికి వందనం’ మరో నాలుగైదు నెలల్లో వస్తుంది.

ఈ పుస్తకంలో కవితల తోపాటు కవుల వివరాలు, వారిపై, వారి కవితలపై వచ్చిన విశ్లేషణలు పొందుపరిచారు. దీని వెనకాల జరిగిన పరిశోధన గురించి చెప్పండి?

సంకలనంలో కవితను ఉదహరించి, రచయిత నేపథ్యం, సంక్షిప్త జీవిత చరిత్ర ఇవ్వక పోవడం సబబు కాదని నా అభిప్రాయం. ‘కవన గర్బరాలు’లో ప్రధాన విభాగంలో ప్రస్తావించబడ్డ ప్రతి రచయిత సంక్షిప్త జీవిత చరిత్ర ఉంది. కొంతమంది రచయితలపై ప్రముఖుల అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రముఖ రచయితల వ్యక్తిత్వాల్ని అర్థం చేసుకోవడానికి ‘మనసులోని కొన్ని మాటలు’ పేరుతో కొంత సమాచారం ఇవ్వబడ్డది. ప్రతి కవితపై, వ్యాఖ్యానం ఉంచబడింది. వ్యాఖ్యానాలు నా సహసంకలనకర్త చేపూరు సుబ్బారావు చాలా ఓపిగ్గా అద్భుతంగా రాశారు. కొన్ని కవితలకు సంబంధిత నేపథ్యం ఇవ్వబడింది. క్లిష్టమైన పదాలకు అర్థాలను పొందుపరచడం జరిగింది.

జీవిత చరిత్రల కొరకు మేము పడ్డ శ్రమ ఇంతా అంతా కాదు. ముఖ్యంగా వెలుగులో లేని రచయితలు కాని, చనిపోయిన వారి సమాచారం కాని పట్టుకోవడం అంత తేలిక కాదు. ముగ్గురు నలుగురి విషయంలో చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘నగ్నవృక్షం’ పేరుతో ఒక మంచి కవితకు పుస్తకంలో స్థానం కల్పించాం. దాని రచయిత పాశం వెంకటేశ్వర్‌ రెడ్డి. ఆయన జీవిత చరిత్ర కొరకు, నేనూ, మౌనశ్రీ మల్లిక్‌ చేయని ప్రయత్నం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన సాహితీవేత్తలందరినీ అడిగాం. ఎక్కడా లభ్యం కాలేదు. అతని జీవిత చరిత్ర పెట్టలేదనే అసంతృప్తి మిగిలిపోయింది.

ఈ కవితల ఎంపిక గురించి రాసిన ముందు మాటలో ‘లయ’ గురించి మాట్లాడారు. ‘లయ’ను ఒక ప్రమాణంగా తీసుకోవటానికి కారణం ఏమిటి?

ఈ సందర్భంలో, గణిత శాస్త్రంలో వాడే రెండు పదాలను ఉదహరించాలి. అవి necessary, sufficient అనే పదాలు. లయ అనేది కవితకుnecessary, sufficient కాదు. లయ అనేది మంచి కవిత అనిపించుకోవడానికి టఠజజజీఛిజ్ఛీుఽ్ట కూడా కాదు. ఉపోద్ఘాతంలో మేము సి. నారాయణ రెడ్డి మాటను ఉంటకించాం. ఏ నియమం లేకుండా శుద్ధ వచనాన్ని లయబద్ధంగా మార్చినచో, అది వచన కవిత అవుతుందని అన్నాడు. ఆయన అన్నప్పటికీ, అధునాతన వచన కవిత్వంలో లయకు అంతగా ప్రాధాన్యత నివ్వడం లేదు. మేము పుస్తకంలో స్థానం కల్పించిన అనేక కవితల్లో లయ ప్రత్యక్షంగానో, అంతర్లీనంగానో ఉంది. లయ ఉన్న కవితలు పాఠకులకు, శ్రోతలకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి.

కవితల్లో లయతో పాటు కవితాశిల్పం కూడా ముఖ్యం. కవితల్లో వస్తువుని, శిల్పాన్ని, రెండింటినీ పరిశీలించాలి. పూర్తిగా వస్తువు వల్లనే కవిత శోభాయమానంగా ఉండదు. వస్తువుకు కవితాశిల్పాన్ని జోడించినప్పుడే అది బాగుంటుంది.

కవితల ఎంపికలో ఎలాంటి కొలమానాలు తీసుకున్నారు?

మొదటిది, రచయిత తీసుకున్న విషయాన్ని అందంగా, ఆసక్తికరంగా చెప్పగలిగాడా అనేది ముఖ్యమైనది. రెండవది, టజ్చిట్ఛఛీ ్ఛ్ఠఞ్ఛటజ్ఛీుఽఛ్ఛి. రచయిత కవితలో వ్యక్తీకరించిన అనుభవాన్ని కాని, అనుభూతిని కాని, చదువరి పొందగలిగాడా అనేది ముఖ్యం. పాఠకుల వ్యక్తిత్వాలను బట్టి, వారి ఆసక్తులను బట్టి, ఈ టజ్చిట్ఛఛీ ్ఛ్ఠఞ్ఛటజ్ఛీుఽఛ్ఛి, విభిన్నమైన వ్యక్తుల్లో విభిన్నమైన ఛ్ఛీజట్ఛ్ఛట లో ఉండవచ్చు. కాని, ్ట్చటజ్ఛ్ట్ఛఛీ ట్ఛ్చఛ్ఛీటట కు అట్లాంటి టజ్చిట్ఛఛీ ్ఛ్ఠఞ్ఛటజ్ఛీుఽఛ్ఛి లభించిందా అనేది ముఖ్యం. ఉదాహరణకు, పాపినేని శివశంకర్‌ రాసిన రెండు కవితలు ఒకటి ముఖేశ్‌ పైన, రెండవది హరిప్రసాద్‌ చౌరాసియా పైన. కొంతమంది పాఠకులకు వారిపై ఆసక్తి ఉండకపోవచ్చు. అందువల్ల అవి మంచి కవితలు కాదనలేం.

ఈ సంకలనంలో కవితల్లో ఎక్కువ శాతం ఎలాంటి ఇతివృత్తాలు ఉన్నాయని గమనించారు?

ఏ ఇతివృత్తం పై అయినా ఎక్కువగా కవితలుంటే ఆది యాదృచ్ఛికమే కాని conscious decision కాదు. వెనక్కి మరలి చూస్తే, నలుగురు కళాకారులపైన కవితలున్నాయి. ఒకటి సూర్యకాంతం, రెండవది భానుమతి, మూడవది ముఖేశ్‌, నాల్గవది హరిప్రసాద్‌ చౌరాసియా. మైకేల్‌ జాక్సన్‌పై కొండెపోగు డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ రాసిన కవితను కూడా కలుపుకుంటే అయిదు కవితలనుకోవచ్చు.

ఈ సంకలనం కూర్పులో మీకు దారి చూపిన, ప్రేరేపించిన సంకలనాలు?

ఏ ఒక్క సంకలనమో మాకు దారి చూపించిందని భావించడంలేదు. కాని ప్రప్రథమంగా, దాదాపు 90 ఏళ్ళ క్రింద, 1935లో ముద్దుకృష్ణ ద్వారా ప్రచురించబడ్డ ‘వైతాళికులు’ పుస్తకం పేరు చెప్పాలి. తరువాత ఎన్నో సంకలనాలు వచ్చినా, ఇప్పటి వరకు కూడా సంకలనం అంటే జ్ఞాపకం వచ్చేది ‘వైతాళికులు’ పుస్తకమే. అయితే ప్రస్తుత కొలమానాలను బట్టి చూస్తే ‘వైతాళికులు’ పుస్తకంలో దోషాలు, పరిమితులు కనిపిస్తాయి. ఈ కొలమానాలను బట్టి ఆ పుస్తకాన్ని విమర్శించడమూ సరి అయింది కాదు. ఆ పుస్తకం వచ్చిన తరవాత గేయకవితలో మార్పులొచ్చాయి. వచన కవిత చాలా ముఖ్యమైన మార్పును తెచ్చింది.

సంకలనానికి సహాయం చేసిన మరికొన్ని inputను ప్రస్తావించడం ఉచితం. 1960 నుండి 1990 వరకు నిరాఘాటంగా అత్యుత్తమ సాహిత్య పత్రికగా పేరొందింది భారతి. ఈ సంకలనం రూపకల్పన జరిగినప్పుడు, దాదాపు 30 ఏళ్ళ భారతి పత్రికల్ని అంటే సుమారు 360 పత్రికలను సంపాదించి పరిశీలించాం. వాటిలో నుండి కొన్ని ఉత్తమ కవితల్ని ఎంపిక చేశాం. అట్లాంటి కవితలు ఇప్పుడు ఎక్కడా దొరకవు. ఉదాహరణకు, గంధం వేదవేశ్వరావు తెలంగాణ మాండలికంలో రాసిన ‘నా దేశం శాన శాన మారింది’.

విజయవాడ నుండి సాహితీమిత్రులు ఏటా ప్రచురించే ‘కవిత’ సంకలనాలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. రచయితల పుస్తకాలు ఎంత సహాయపడతాయో చెప్పనక్కరలేదు. అనువాద కవితలకు అనిల్‌ బత్తుల తీసుకొచ్చిన ‘దేశదేశాల కవిత్వం’ ఉపయోగపడింది.

98480 52486

Updated Date - Apr 15 , 2024 | 12:40 AM