‘స్వర్ణకాంతులు – దివ్యదీపాలు!’
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:51 AM
‘స్వర్ణభారత’ మంటప ద్వారాలకు చక్కగా – జాతీయతా దీపాల తోరణాలు కట్టండి! హరితకాంతులొలుకు సౌభాగ్య దీపాలను ఇంటింటా...
‘స్వర్ణభారత’ మంటప ద్వారాలకు చక్కగా –
జాతీయతా దీపాల తోరణాలు కట్టండి!
హరితకాంతులొలుకు సౌభాగ్య దీపాలను –
ఇంటింటా – పసిడిగుమ్మాలపై తీర్చండి!
ఆసేతుహిమాచలం దివ్యంగా ప్రజల –
గుండెల్లో వెలిగే దీపాలు – సమతామమతగీతాలు!
దేశమాత ముంగిట ధీరంగా వెలిగే దీపాలు –
భారత వీరజవానుని శౌర్యవిజయ ధ్వజాలు
పంట పొలాల్లో తలలూపే – సస్యశ్యామల దీపాలు –
అన్నదాతల – కష్టజీవుల – స్వర్ణశుభోదయరేఖలు
పల్లెపల్లెల్లో తళతళలాడే – సంస్కృతీదీపాలు –
ఆత్మీయడా – సౌహార్ద్రతా క్షీరతరంగాలు
యువజనుల హృదయాల్లో వెలిగేదీపాలు –
భావిభారత భాగ్యోదయ విజయాశీస్సులు
పసిడి బాలల లేతమనస్సుల్లో వెలిగే దీపాలు –
పూలతోటలో తిరుగాడే – బాలబాపూజీలు
స్వాతంత్ర్యవజ్రభారతి – ముంగిట వెలిగే దీపాలు –
సువర్ణ సుప్రభాత – జనగణమన విజయకిరణాలు
దేవాలయ ప్రాంగణాల్లో వెలిగే – సువర్ణ దీపాలు –
‘‘సర్వేజనాః సుఖినోభవంతి’’ – అనే దివ్యాశీస్సుమాలు
కళ్యాణశ్రీ