Share News

జీవితం ఎక్కడ పడిపోయిందో తెలియనే లేదు

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:23 AM

జాతరలో, మేళాలో బాంసురీలు అమ్ముకుంటూ తిరిగాను దారిపొడుగునా బెలూన్లు అమ్ముకుంటూ నడిచాను...

జీవితం ఎక్కడ పడిపోయిందో తెలియనే లేదు

జాతరలో, మేళాలో

బాంసురీలు అమ్ముకుంటూ తిరిగాను

దారిపొడుగునా

బెలూన్లు అమ్ముకుంటూ నడిచాను

ఆకలికి ఎక్కడా ఆగలేదు

దాహానికి ఎవరినీ అడగలేదు

చీకటి పడేవేళ రోడ్ల మీద

దీపాలు అమ్ముతూ కూర్చున్నాను

అలసిపోయి చేతిలో చూసుకుంటే,

జీవితం ఎక్కడ పడిపోయిందో

శబ్దమే వినిపించ లేదు

ఎప్పుడు పడిపోయిందో

ఎట్లా జారిపోయిందో

నాకు తెలియనే లేదు

ఆశారాజు

asharaju.poet@gmail.com

Updated Date - Jul 01 , 2024 | 12:23 AM