Share News

అనుకుంటాం కానీ..

ABN , Publish Date - May 06 , 2024 | 01:30 AM

మరొకరి ప్రేమ వలన మనకొచ్చేది ఏముంది! మోహమూ మోసమూ...

అనుకుంటాం కానీ..

మరొకరి ప్రేమ వలన

మనకొచ్చేది ఏముంది!

మోహమూ మోసమూ

కలిసిరావడం కన్నా

కలిదోషమేముంది!

దంభమూ దాహమూ

వరుస విజయాలొసగని

విషాదమేముంది!

విస్మృతీ ఓటమీ

వద్దు వద్దుఅనుకోగలిగితే

వచ్చి చేరనిదేముంది!

మోక్షమూ మోదమూ

టి. శ్రీవల్లీ రాధిక

Updated Date - May 06 , 2024 | 01:30 AM