మూసీ నదిపై రచనల ఆహ్వానం
ABN , Publish Date - Oct 23 , 2024 | 01:21 AM
మూసీ నదిపై త్వరలో ‘చంద్రికా గ్రంథ మండలి’ ఒక పుస్తకాన్ని ప్రచురించనున్నది. విశ్వనగరమైన హైదరాబాద్‌లో ప్రవహించే మూసీ నది సుందరీకరణ, మూసీ ప్రక్షాళన...
మూసీ నదిపై త్వరలో ‘చంద్రికా గ్రంథ మండలి’ ఒక పుస్తకాన్ని ప్రచురించనున్నది. విశ్వనగరమైన హైదరాబాద్‌లో ప్రవహించే మూసీ నది సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం అంశాలపై వాద ప్రతివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. దీని కోసం మూసీ నదిపై కవిత, కథ, పద్యం, గేయం, పాట... ఇలా ఏదైనా సాహిత్య ప్రక్రియలో రచన చేసి అక్టోబర్ 30లోపు cgmts2017@gmail.comకు మెయిల్ చేయాలి. వివరాలకు: 92908 26988
– ఎస్. విజయ భాస్కర్,
అధ్యక్షులు, చంద్రికా గ్రంథ మండలి