ఇవతల
ABN , Publish Date - Aug 05 , 2024 | 05:30 AM
దేహం ఓ చీకటి పదం పలకలేని నిశ్శబ్దవెలుతురది ముడుచుకున్న ఆకారాల్లో ఆమె ఆత్మ చూసావా...
దేహం
ఓ చీకటి పదం
పలకలేని నిశ్శబ్దవెలుతురది
ముడుచుకున్న ఆకారాల్లో
ఆమె ఆత్మ చూసావా
ఓ అజిహ్వ మరణ ప్రయాణం
కొత్త కన్నీరు పాత దేహంపై
విడిపోయే విడివిడి అక్షరాలకే తెలుసు
ఎంత వంచననైనా ప్రేమతో దిగమింగుకోవాలి
ఎం ఎస్ నాయుడు