Share News

కన్నీరు–పన్నీరు

ABN , Publish Date - May 04 , 2024 | 04:39 AM

ఓ ఓటరు మహాశయులారా! మీ సౌఖ్యమే కాదు లోక హితం, సమాజశ్రేయస్సు మనందరి బాధ్యతని గుర్తెరిగి అభివృద్ధి నిరోధకులను ఓడించడానికి ఏకంకండి....

కన్నీరు–పన్నీరు

ఓ ఓటరు మహాశయులారా!

మీ సౌఖ్యమే కాదు

లోక హితం, సమాజశ్రేయస్సు

మనందరి బాధ్యతని గుర్తెరిగి

అభివృద్ధి నిరోధకులను

ఓడించడానికి ఏకంకండి.

ఉద్యోగం రాక, ఉపాధి లేక

జీవనం అంధకారబంధురమై

నైరాశ్యంలో నలిగిపోబోయే భావితరాలకు

భవితనిచ్చుటకై

అభివృద్ధికి శరాఘాతాలైన

ఉచితాలపై

చండప్రచండులై విజృంభిద్దాం,

వ్యవస్థలోని అవస్థలను ప్రశ్నించి

అభివృద్ధికి ఆకాశమే హద్దు చేసేద్దాం.

రండీ! కదలిరండి ఓట్ల పండుగకు.

ఓ ఓటరా!

త్యాగమూర్తుల చేతులు

భరతమాత నుదుట దిద్దిన వీరతిలకం

దశదిశలా ప్రకాశింపచేసిన

ప్రభాత అరుణిమ ఈ నేల,

విద్యలతో విలసిల్లిన వేదభూమి ఇది.

అంత ఘన చరిత్ర ఉన్న ఈ గడ్డని

తమ స్వార్ధ రాజకీయాలకు

బలి చేసేస్తున్నారు

నేటి తరం రాజకీయ నాయకులు,

తమ అనాలోచితచర్యలతో

మరో నైజీరియాలా చెయ్యబోతున్నారు.

అందుకే ప్రస్తుతపు ఎన్నికల పండుగ

నీ జీవితానికి వికాశం!

అవకాశాన్ని చేజార్చుకుంటే కన్నీరు!

ఒడిసిపట్టుకుంటే పన్నీరు!

చేసుకుంటే సద్వినియోగం

చేసినట్టే అశ్వమేధ యాగం!

ఆలోచించి ఉత్తములను ఎన్నుకో,

నీ పురిటిగడ్డను నీవే కాపాడుకో.

వేమూరి శ్రీనివాస్

Updated Date - May 04 , 2024 | 04:39 AM