మాయమైన బ్రతుకులు
ABN , Publish Date - Aug 12 , 2024 | 01:12 AM
అట్టుగ దులుపుతున్నప్పుడు పాతబడిపోయిన... నాగలి, నక్కు, కత్తి, పార కనబడి గతం గుర్తుకొస్తుంది ఒకప్పుడు మేమూ రైతులమేనని..
అట్టుగ దులుపుతున్నప్పుడు
పాతబడిపోయిన...
నాగలి, నక్కు, కత్తి, పార కనబడి
గతం గుర్తుకొస్తుంది
ఒకప్పుడు మేమూ రైతులమేనని..
త్రోవంట వెళ్తున్నప్పుడు
ఎక్కడో దూరాన పొలంలో
పిల్ల జల్లా శ్రమైక్య సౌందర్యంతో కనబడి
గతం కళ్ళముందు మెదలాడుతుంది
ఒకప్పుడు మేమూ ఇంతేనని
ఒక్కోసారి టీవీలో, ఏదో ఒక సినిమాలో
పచ్చని పొలాలు, పట్టెడు సంసారం చూపిస్తే
ఉన్నపళంగా ఉసురుమనిపిస్తుంది
ఇదంతా మా నుండి
ఎప్పుడు లాక్కుపోయారోనని
కడుపు కాలి షాపింగ్ మాల్‌కు వెళ్తే
అక్కడ కనిపిస్తుంది...
మోసపోయింది ఇక్కడేనని!
మాయమైనవన్నీ మార్కెట్లో బంధీ అని!
n వినోద్ కుత్తుం
9634314502