Share News

ప్రూఫ్ రీడింగ్

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:53 AM

‘‘గులాబీలో ఈ ఒత్తెవర్రా పెట్టింది?’’ అది ఒత్తుగా పూసిందమ్మి ‘‘ఇంద్ర ధనుస్సు మధ్యలో ఈ ఖాళీ ఎందుకు?’’ అదీ... మన ఎడబాటు గుర్తుగా...

ప్రూఫ్ రీడింగ్

‘‘గులాబీలో ఈ ఒత్తెవర్రా పెట్టింది?’’

అది ఒత్తుగా పూసిందమ్మి

‘‘ఇంద్ర ధనుస్సు మధ్యలో ఈ ఖాళీ ఎందుకు?’’

అదీ... మన ఎడబాటు గుర్తుగా...

‘‘పద్యం పొట్టలో ఈ చుక్కేంటి మరి?’’

ఊ.. నీకు పొద్దులు పడ్డట్టు కల..

‘‘రేయ్ రేయ్... హృదయంలో ఈ దీర్ఘం?’’

అది ఊపిరిదమ్మి. నువ్వు ముద్దిచ్చినప్పటిది.

నందకిశోర్

Updated Date - Oct 28 , 2024 | 05:53 AM