యుద్ధం ఉవాచ
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:14 AM
నా పొలికేక ముందు- సకల కళలూ.. రాతిబొమ్మకు అమ్మ చనుబాలు! సమస్త విజ్ఞానాలూ..
నా పొలికేక ముందు-
సకల కళలూ..
రాతిబొమ్మకు అమ్మ చనుబాలు!
సమస్త విజ్ఞానాలూ..
కార్చిచ్చులో జల్లిన విత్తనాలు!
యావత్తు తత్వాలూ..
అడుగుజాడకే నోచని బాటలు!
నా క్షిపణి వేగం ముందు -
మానవ ప్రస్థానం..
కొయ్యగుర్రంపై వేల ఏళ్ళ స్వారీ!
చరిత్ర..
బావురుమనిపించే
ఛలోక్తుల సంపుటి!
వి-రాగి
99593 65373