Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 11 2024

ABN , Publish Date - Nov 11 , 2024 | 01:36 AM

సోమ సుందర్ శత జయంతి సభ, కథా రచయితల సమాలోచన, సామాజిక అంశాలతో కథల పోటీ, ‘జ్ఞానజ్యోతి’ పురస్కార ప్రదానం, ‘అంతరంగ వీక్షణం’ ఆవిష్కరణ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 11 2024

సోమ సుందర్ శత జయంతి సభ

ఆవంత్స సోమసుందర్ శత జయంతి మహా సభ నవంబర్‌ 17 ఉ.10గంటల నుంచి చల్లా జగన్నాథ శాస్త్రి కళామందిర్, విద్యుత్ నగర్, కాకినాడలో జరుగు తుంది. ‘ఆవంత్స సోమసుందర్’ గ్రంథా విష్కరణతో ప్రారంభమయ్యే సభలో చందు సుబ్బారావు, మండలి బుద్ధ ప్రసాద్, రెంటాల శ్రీవేంకటేశ్వర రావు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, పెనుగొండ లక్ష్మీనారాయణ, వల్లూరు శివప్రసాద్, చిరంజీవినీ కుమారి, ఆలూరి విజయ లక్ష్మి, హెచ్‌ఎస్‌వీకే రంగారావు తదితరులు పాల్గొంటారు.

సోమసుందర్ లిటరీ ట్రస్టు

కథా రచయితల సమాలోచన

తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం, కాకినాడ ఆధ్వర్యంలో ‘కథ –-ఏమిటి, -ఎందుకు, -ఎలా’ శీర్షికన నవంబర్ 24న జరిగే కథా సదస్సులో పి. చిరం జీవినీ కుమారి, నండూరి రాజగో పాల్, మహ్మద్ ఖదీర్ బాబు, ఆలూరి విజయ లక్ష్మి, వాడ్రేవు వీరలక్ష్మి దేవి, దాట్ల దేవ దానం రాజు, జి. వెంకట కృష్ణ, చోర గుడి జాన్సన్, అద్దేపల్లి ప్రభు, శిఖామణి, ఎల్.కె. సుధాకర్, కుప్పిలి పద్మ తదిత రులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ కోసం ఫోన్‌: 94915 04045.

తూ.గో.జిల్లా రచయితల సంఘం


సామాజిక అంశాలతో కథల పోటీ

అక్షరాల తోవ సంస్థ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహి స్తున్న కథల పోటీలో మూడు ఉత్తమ కథలకు రూ.2వేలు, మూడు మంచి కథలకు రూ.500 నగదు బహుమ తులు ఉంటాయి. కథ ఎ4 సైజులో డీటీపీలో ఐదు పేజీలకు మించరాదు. కథలను డిసెం బర్ 10 లోపు పోస్ట్ / కొరియర్ ద్వారా చిరునామా: రాచ మళ్ళ ఉపేందర్, స్టార్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జి ఎదురు గా, స్టేషన్ రోడ్, ఖమ్మం – 507001కు పంపాలి. వివరాలకు: 98492 77968.

అక్షరాల తోవ

‘జ్ఞానజ్యోతి’ పురస్కార ప్రదానం

తెలుగు సాహిత్య రంగంలో కృషి చేస్తున్న పరిశోధక రచయితకు ఆంధ్ర ప్రదేశ్‌ రచయితల సంఘం ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కా రాన్ని 2024కి గాను వెలమల సిమ్మన్న స్వీకరిస్తారు. రూ.3వేల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువాలతో నవంబర్‌ 17 సాయం త్రం విజయవాడ లోని మహాత్మ గాంధీ రోడ్డు లోగల ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో రచయితకు సత్కా రం ఉంటుంది. చిల్లర భవానీదేవి, పాపినేని శివశంకర్‌, కె. రమాదేవి తదితరులు పాల్గొంటారు.

చలపాక ప్రకాష్‌


‘అంతరంగ వీక్షణం’ ఆవిష్కరణ

గ్రంథాలయ వారోత్సవాల సంద ర్భంగా నవంబరు 17ఉ.10 గంట లకు విజయవాడ బందరురోడ్డులో గల ఠాగూర్ గ్రంథాలయంలో మల్లెతీగ సా హిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో కొమ్మవర పు విల్సన్ రావు ముఖాముఖిల సంకలనం ‘అంతరంగ వీక్షణం’ ఆవి ష్కరణ జరుగుతుంది. వర్ల రామ య్య ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకు జి. లక్ష్మీ నరసయ్య అధ్యక్షత వహిస్తారు. విశిష్ట అతిథులు– సుంకర గోపాల్, అన్నవరపు బ్రహ్మయ్య, సత్యాజీ.

కలిమిశ్రీ

Updated Date - Nov 11 , 2024 | 01:36 AM