Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 11 2024

ABN , Publish Date - Nov 18 , 2024 | 05:33 AM

పోలవరపు సాహిత్య సర్వస్వం, ‘కథా కచ్చీరు’ విమర్శ పుస్తకం, ప్రతిభా పురస్కారం, ‘విజయ గాథ’ స్వీయచరిత్ర, ‘వేకువ’ కథాసంపుటి...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 11 2024

పోలవరపు సాహిత్య సర్వస్వం

పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మూడవ భాగం ఆవిష్కరణ సభ నవంబర్‌ 18 సాయంత్రం 5గంటలకు ‘దేవరాయ’ సమావేశ మందిరం, 2వ అంతస్తు, హోటల్‌ దసపల్లా, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ, గౌరవ అతిథి పరుచూరి గోపాలకృష్ణ, ఆత్మీయ అతిథి దూపాటి విజయ కుమార్‌, అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌.

లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌

‘కథా కచ్చీరు’ విమర్శ పుస్తకం

వెల్దండి శ్రీధర్‌ సాహిత్య విమర్శ పుస్తకం ‘కథా కచ్చీరు’ ఆవిష్కరణ సభ దక్కన్‌ సాహిత్య సభ – మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 23 సాయంత్రం 5గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి వెల్దండ నిత్యానందరావు, ఆవిష్కర్త కె. శ్రీనివాస్‌, అధ్యక్షత సి. కాశీం.

టి.వి. నారాయణ


ప్రతిభా పురస్కారం

దళిత సాహిత్య సాంస్కృతిక రంగంలో కృషి చేసిన మహిళకు ఇచ్చేందుకు కొత్తగా మొదలైన -‘డా. శ్రీకాకుళపు జాయ్ అడిల్ మేరీరాయ్ స్మారక ప్రతిభా పురస్కారం’ ఈ ఏడాదికి జూపాక సుభద్ర స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం నవంబర్‌ 22న విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో జరుగుతుంది.

జాన్సన్‌ చోరగుడి

‘విజయ గాథ’ స్వీయచరిత్ర

బోయి విజయ భారతి స్వీయ చరిత్ర ‘విజయ గాథ’ & విజయ భారతి స్మారక సంచిక ఆవిష్కరణ సభ నవంబర్ 23 సాయంత్రం 5.30 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లిలో జరుగుతుంది.

బొజ్జా తారకం ట్రస్ట్


‘వేకువ’ కథాసంపుటి

మజ్జి భారతి కథా సంపుటి ‘వేకువ’ ఆవిష్కరణ సభ నవంబర్‌ 24 ఉదయం 10గంటలకు విజయనగరం జిల్లా రాజాంలోగల శ్రీవిద్యా నికేతన్‌ పాఠశాలలో జరుగుతుంది. అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, పొట్నూరు కోటిబాబు అతిథులుగా పాల్గొంటారు.

గార రంగనాథం

Updated Date - Nov 18 , 2024 | 05:33 AM