ఈ వారం వివిధ కార్యక్రమాలు 21 10 2024
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:25 AM
‘యోధ’ ఆవిష్కరణ, కవి సంధ్య స్వర్ణోత్సవం. రొట్టమాకురేవు కవిత్వ అవార్డు, ‘నానీ కిరణాలు’ ఆవిష్కరణ ...
‘యోధ’ ఆవిష్కరణ
హస్మిత ప్రచురణలు, హైదరాబాద్ విమెన్ రైటర్స్ ఫోరం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయ భండారు సంపాదకత్వంలో ‘యోధ – మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు’ పుస్తకావిష్కరణ సభ అక్టోబర్ 22 మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత ఓల్గా; ఆవిష్కర్త కె. శ్రీనివాస్; ముఖ్య అతిథి కొలక లూరి ఆశాజ్యోతి; గౌరవ అతిథులు సంధ్య, మామిడి హరికృష్ణ; పుస్తక పరిచయం గోపరాజు సుధ, అపర్ణ తోట, ఘంటశాల నిర్మల, రచన.
గిరిజ పైడిమర్రి
కవి సంధ్య స్వర్ణోత్సవం
‘కవి సంధ్య’ కవిత్వ పత్రిక 50 సంచికలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 27 ఉ.10 గంటలకు యానాం గీతా భవన్‌లో స్వర్ణోత్సవ సభ జరుగుతుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ; వాడ్రేవు చినవీరభద్రుడు, పాయల మురళీకృష్ణలకు కవితా పురస్కారాలు; పదిమందికి సంధ్య ప్రతిభా పురస్కారాల ప్రదానం; శిఖామణి మలయాళ కవిత్వ గ్రంథావిష్కరణ; కవి సమ్మేళనం ఉంటాయి. సభలో మల్లాడి కృష్ణారావు, దీర్ఘాశి విజయ్ భాస్కర్, సి. మృణాళిని, వీరలక్ష్మీదేవి, ఆర్. సీతారాం తదితరులు పాల్గొంటారు.
కవి సంధ్య
రొట్టమాకురేవు కవిత్వ అవార్డు
రొట్టమాకురేవు కవిత్వ అవార్డు – 2024 సభ అక్టోబర్ 27 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత ప్రసేన్; ముఖ్య అతిథి కె. శివారెడ్డి; వక్తలు లక్ష్మీనరసయ్య గుంటూరు, పేర్ల రాము. షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డును ఏనుగు నరసింహా రెడ్డి (‘నీడలదృశ్యం’); పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును అరుణ నారదభట్ల (‘లోపలి ముసురు’); కె.ఎల్. నర్సింహారావు స్మారక అవా ర్డును తండా హరీష్ గౌడ్ (‘గాలిలేని చోట’), సాంబమూర్తి లండ (‘నాలుగురెక్కల పిట్ట’) అందుకుంటారు.
యాకూబ్
‘నానీ కిరణాలు’ ఆవిష్కరణ
కంచనపల్లి రవికాంత్ కవితా సంపుటి ‘నానీ కిరణాలు’ ఆవిష్కరణ సభ అక్టోబర్ 27 ఉ.10గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి, ఆవిష్కర్త ఎన్. గోపి; అధ్యక్షులు ఎస్. రఘు; విశిష్ట అతిథి సూర్యా ధనంజయ్; గౌరవ అతిథి జి. శ్యాంప్రసాద్ లాల్; ఆత్మీయ వాక్యాలు తగుళ్ల గోపాల్, తండ హరీష్ గౌడ్.
బోధి ఫౌండేషన్