Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 12 2024

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:16 AM

‘నాగ స్వరం’ కవిత్వం, ‘చెమట చెక్కిన వాక్యం’ వ్యాసాలు, ‘గచ్చెంసెట్టుకి అటూ ఇటూ’ కవిత్వం, కొలకలూరి పురస్కారాలకు గ్రంథాల ఆహ్వానం, పీచర పురస్కారాలకు గ్రంథాల ఆహ్వానం, కవితా సంపుటాలకు ఆహ్వానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 12 2024

‘నాగ స్వరం’ కవిత్వం

కోయి కోటేశ్వర రావు కవితా సంపుటి ‘నాగ స్వరం’ ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 27 సా.6గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో (ఎన్‌టిఆర్ స్టేడి యం, ఇందిరా పార్క) తోపుడు బండి సాధిక్ ఆలీ వేదికపై జరుగుతుంది. సభాధ్య క్షులు ఎం.ఎం. వినోదిని, ముఖ్య అతిథి, ఆవిష్కర్త శిఖామణి, ఆత్మీయ అతి థులు యాకూబ్, నక్కా విజయరామ రాజు, సంగిశెట్టి శ్రీనివాస్, పసునూరి రవీందర్, జె. నీరజ.

సాహితీ పబ్లికేషన్స్‌

‘చెమట చెక్కిన వాక్యం’ వ్యాసాలు

కెంగార మోహన్‌ వ్యాస సంపుటి ‘చెమట చెక్కిన వాక్యం’ ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 29ఉ.10 గంటలకు విజయవాడ లోని బాలోత్సవ్‌ భవన్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త గుంటూరు లక్ష్మీనరసయ్య, పుస్తక పరిచయం– జి. వెంకటకృష్ణ, లోసాని సుధాకర్‌, కెంగార మోహన్‌, వొరప్రసాద్‌. వివరాలకు: 94900 99059.

సాహితీ స్రవంతి


‘గచ్చెంసెట్టుకి అటూ ఇటూ’ కవిత్వం

పాయల మురళీకృష్ణ కవితా సంపుటి ‘గచ్చెంసెట్టుకి అటూ ఇటూ’ ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 29 సా.5గంటలకు విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో జరుగుతుంది. సభలో చీకటి దివాకర్, దుర్గా ప్రసాదరావు, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, గార రంగనాథం, మానస చామర్తి, సుంకర గోపాలయ్య, శ్రీరాం పుప్పాల కంచరాన భుజంగరావు, లండ సాంబమూర్తి పాల్గొంటారు.

సాహితీస్రవంతి

కొలకలూరి పురస్కారాలకు గ్రంథాల ఆహ్వానం

కొలకలూరి భాగీరథీ కవిత్వ పురస్కారం, కొలకలూరి విశ్రాం తమ్మ నాటక పురస్కారం, కొలకలూరి రామయ్య పరిశోధన పుర స్కారాలకు 1.1.2023 తర్వాత ముద్రితమైన గ్రంథాలను 15.1.2025 లోగా చేరేటట్లుగా పంపాలి. ప్రతి అవార్డుకు రూ.15వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో 26.2.2025న హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో పురస్కార ప్రదానం ఉంటుంది. కవిత్వం, నాటకం పంపాల్సిన చిరునామా: కొలకలూరి మధుజ్యోతి (9441923172), తెలుగు శాఖాధ్యక్షులు, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి– 517502. పరిశోధన గ్రంథాలు పంపాల్సిన చిరునామా: కొలకలూరి సుమకిరణ్‌ (9963564664), ఆంగ్లాచార్యులు, శ్రీ వేంక టేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి – 517 502.

కొలకలూరి ఇనాక్‌


పీచర పురస్కారాలకు గ్రంథాల ఆహ్వానం

పీచర సునీతారావు పౌండేషన్ కవిత్వం, కథలు, విమర్శ ప్రక్రియలలో సంపుటాలను ఆహ్వానిస్తున్నది. ఎన్నికైన ప్రతి సంపుటానికి రూ.15వేల నగదు, సత్కారం ఉంటాయి. మార్చ్ 2021 నుండి మార్చ్ 2024 వరకు వెలు వడిన రచనలు 3 ప్రతులను ఫిబ్రవరి 10, 2025లోగా చిరునామా: పీచర సునీతా రావు పౌండేషన్, కేర్‌ ఆఫ్‌/ విజయేందర్ రావు, ప్లాట్ నం. 505. బ్లాక్–డి, భీమా ప్రైడ్‌ అపార్ట్‌మెంట్స్‌ నియర్ సుచిత్ర సర్కిల్, జీడిమెట్ల, హైదరా బాద్- 67, ఫోన్‌– 9866043441కు పంపాలి.

కాంచనపల్లి గోవర్ధన్ రాజు

కవితా సంపుటాలకు ఆహ్వానం

సాహితీ గౌతమి అంద జేస్తున్న సినారె కవితా పురస్కారం 2022కి గాను తెలుగు రాష్ట్రాల నుండి వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. కవులు 2019, 20, 21 సంవ త్సరాలలో ముద్రించబడిన వారి కవితా సంపు టాలు నాలుగు ప్రతులను డిసెంబర్‌ 31లోగా పంపాలి. గతంలో ఈ పురస్కారం పొందిన కవులకు అవకాశం లేదు. చిరునామా: ఎడవల్లి విజయేంద్రరెడ్డి, శివానంద ఆసుపత్రి, ఇం. నెం. 3-3-181, సవరన్ స్ట్రీట్, కరీంనగర్ – -505001కు పంపాలి. మరిన్ని వివరాలకు: 9490401861.

నంది శ్రీనివాస్

Updated Date - Dec 23 , 2024 | 01:16 AM