Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 28 10 2024

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:44 AM

మండల స్వామి సంస్మరణ సభ, కవి వారం – -కవిత్వ తరగతి, జి.ఎన్‌. సాయిబాబా సంస్మరణ సభ, రాయలసీమ నాటక రచనా పోటీలు, ‘చారల పిల్లి’ కథల పుస్తకం, వచన కవిత అధ్యయన శిబిరం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 28 10 2024

మండల స్వామి సంస్మరణ సభ

దివంగత కవి రచయిత మండల స్వామి సంస్మరణ సభ, మిత్రులచే స్వామి కవిత్వ పఠన కార్యక్రమం అక్టో బర్‌ 30 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కవుల వేదిక సమావేశ మందిరం, విజయశ్రీ కాలనీ కమ్యూ ని టీ హాల్, వనస్థలిపురం, హైదరాబాద్‌లో జరుగుతుంది. మండల స్వా మి మిత్రు లందరికీ ఆహ్వానం. వివరాలకు: 89788 69183

ఏనుగు నరసింహారెడ్డి

కవి వారం-కవిత్వ తరగతి

తెరసం – జంట నగరాలు, తెలుగు భాషా సంస్కృతి శాఖల నిర్వహణలో నవంబర్‌ 3 మధ్యాహ్నం 2గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో ‘కవి వారం– -కవిత్వ తరగతి, కవి సమ్మేళనం’ కార్యక్రమం జరుగుతుంది. నందిని సిధా రెడ్డి ‘వర్తమాన జీవితం–వచన కవిత నిర్మాణం’ అంశంపై ప్రసంగిస్తారు. కందు కూరి శ్రీరాములు, మామిడి హరికృష్ణ, సంపత్ కుమార్ పాల్గొంటారు.

తెలంగాణ రచయితల సంఘం


జి.ఎన్‌. సాయిబాబా సంస్మరణ సభ

జి.ఎన్‌. సాయిబాబా సంస్మరణ సభ సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ అధ్యక్షతన అక్టో బర్‌ 30 సాయంత్రం 5.30 గంటలకు సి.పి.యం. కార్యాలయంలోని కొరటాల సత్యనారాయణ హాలు, 2/7, బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుంది. ‘తెలుగు కవిత్వంలో కా. సాయిబాబా’ అంశంపై అరసవెల్లి క్రిష్ణ, ‘ప్రజా ప్రతిఘటన నమూనాగా కా. సాయిబాబా’ అంశంపై పాణి ప్రసంగిస్తారు.

విరసం

రాయలసీమ నాటక రచనా పోటీలు

రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ‘రాయలసీమ సమాజం – జీవ సంస్కృతి’ నేపథ్యంగా ఏకాంకిక, నాటిక, నాటక రచనా పోటీలను ఎం.వి. రమణారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్నాం. డిసెంబరు 22 లోపు రచనలను పంపాలి. మొత్తం రూ.15వేల నగదు బహుమతులు అందచేస్తాం. పూర్తి వివరాలకు: 99639 17187.

అప్పిరెడ్డి హరినాథరెడ్డి


‘చారల పిల్లి’ కథల పుస్తకం

వేంపల్లె షరీఫ్‌ రాసిన ‘చారల పిల్లి’ కథల పుస్తకం ఆవిష్కరణ నవంబరు 3 సాయంత్రం 5 గంటలకు విజయవాడ లోని బుక్ ఫెస్టివల్ కాన్ఫరెన్సు హాల్లో జరుగుతుంది. ఖాదర్‌ మొహియుద్దీన్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. వక్తలుగా కాట్రగడ్డ దయానంద్‌, మల్లీశ్వరి, అరు ణాంక్‌ లత, బత్తుల ప్రసాద్‌, అనిల్ డానీ పాల్గొంటారు.

సూఫీ పబ్లికేషన్స్

వచన కవిత అధ్యయన శిబిరం

తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వ ర్యంలో నవంబర్‌ 24న ఇప్పటికే కవిత్వ రంగంలో కొంత కృషి చేసినవారికి వస్తు, శిల్పపరమైన శిక్షణ కోసం వచన కవిత్వ అధ్యయన శిబిరం జరుగుతుంది. కవులు ఇప్పటివరకు వెలువరించిన కవితల వివ రాలను తెలియజేస్తూ, మచ్చుకు ఒక కవితను 9603727234 వాట్సాప్‌ నెంబర్‌కు పంపాలి.

జె. చెన్నయ్య

Updated Date - Oct 28 , 2024 | 05:44 AM