Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 30 09 2024

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:19 AM

శిఖామణి సాహితీ పురస్కారాలు, 25ఏండ్ల తెలంగాణ కథల సంకలనం, యూత్ లిటరరీ ఫెస్ట్ - 2024, ‘పంచుకుందాం రా!’ కవిత్వం, ‘కథ 2023’ ఆవిష్కరణ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 30 09 2024

శిఖామణి సాహితీ పురస్కారాలు

కవి సంధ్య – శిఖామణి జీవన సాఫల్య కవితా పురస్కారం 2024 కు వాడ్రేవు చినవీరభద్రుడు, శిఖామణి యువ కవితా పురస్కారానికి పాయల మురళీ కృష్ణ ఎంపిక అయ్యారు. జీవన సాఫల్య పురస్కారానికి రూ.10వేలు, యువ కవితా పురస్కారానికి రూ.5వేల నగదు, శాలువా, జ్ఞాపికలతో సత్కారం ఉంటుంది. పురస్కార ప్రదాన సభ అక్టోబర్ చివరి వారంలో యానాంలో జరుతుంది.

దాట్ల దేవదానం రాజు

25ఏండ్ల తెలంగాణ కథల సంకలనం

బి. ఎస్‌. రాములు విశాల సాహితి పురస్కారం పొందిన కథలతో పాటు మరికొన్ని కథలు ఎంపిక చేసి 75 ఉత్తమ కథలతో 25 ఏండ్ల తెలంగాణ ఉత్తమ ప్రాతినిధ్య కథల సంకలనం తేనున్నాము. రచయితలు 25 ఏళ్లలో తాను రాసిన కథ ఉత్తమ కథల్లో ఒకటి అని ఎందుకు భావిస్తున్నారో, గత 25 ఏండ్లలో చదివిన కథల్లో పది ఉత్తమ కథలు ఏమిటో ఎందుకో చెబుతూ రాయాలి. పావు శతాబ్దం కథల సమీక్ష మూల్యాంకనం చేస్తూ వెలువడే ఈ కథా సంకలనం కోసం మరిన్ని వివరాలూ కావాలి. అవేమిటో తెలుసుకొనేందుకు 8331966987లో సంప్రదించండి.

విశాల సాహిత్య అకాడమి


యూత్ లిటరరీ ఫెస్ట్ - 2024

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూత్ లిటరరీ ఫెస్ట్ నిర్వ హించనున్నాం. ఇందులో యువ కవులు, రచయితలు (40ఏండ్ల లోపు వారు) స్వీయ రచనలపై మాట్లాడతారు. నవల, కథ, విమర్శ, పాట, కవిత్వం అనే ఐదు అంశాలపై చర్చలు చేస్తారు. అతిథులు సైతం యువతే ఉండటం ఈ ఫెస్ట్ ప్రత్యేకత. వివరాలకు: 8897765417

కె. ఆనందాచారి

‘పంచుకుందాం రా!’ కవిత్వం

సుప్రీమ్ కోర్టు రిజర్వేషన్ల పంపిణీ న్యాయం తీర్పు నేపథ్యంలో కృపాకర్ మాదిగ రాసిన ‘పంచుకుందాం రా!’ కవిత్వ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబరు 30సా.6.30గంలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. జూపాక సుభద్ర అధ్యక్షతన జరిగే సభలో కె. శ్రీనివాస్, జిలుకర శ్రీనివాస్, అంబటి సురేంద్ర రాజు, జి.వి.రత్నాకర్, కవి యాకూబ్, గజవెల్లి ఈశ్వర్, ఎస్.ఎం. బాషా, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్వేచ్ఛ వోటార్కర్ తదితరులు పాల్గొంటారు.

దండోరా పబ్లికేషన్స్, జంబూద్వీపం


‘కథ 2023’ ఆవిష్కరణ

జాషువా సాహిత్య వేదిక, ఖమ్మం నిర్వహణలో కథ సాహితి సంకలనాల పరంపరలో 34వది ‘కథ 2023’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 6 సా.5.30కి జడ్‌.పి.హాల్‌, ఖమ్మంలో జరుగుతుంది. అధ్యక్షత రవిమారుత్‌, ఆవిష్కరణ కె. శ్రీనివాస్‌, ఆత్మీయ అతిథులు కె. శివారెడ్డి, మువ్వా శ్రీనివాసరావు, పుస్తక సమీక్ష పి. జ్యోతి, కథా సాహితి సంపాదకులు వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌. ఆవిష్కరణ అనంతరం కథ 2023 కథా రచయితలతో ముఖాముఖి ఉంటుంది. ఎ.వి. రమణమూర్తి నిర్వహణలో కథ 2023 సంకలనంలోని కథా రచయితలు తమ కథా నేపథ్యాన్ని వివరిస్తారు.

వాసిరెడ్డి నవీన్‌

Updated Date - Sep 30 , 2024 | 12:19 AM