ఈ వారం వివిధ కార్యక్రమాలు 30 12 2024
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:07 AM
పిల్లల బొమ్మల పుస్తకాల కోసం రచనలకు ఆహ్వానం, వేమన పద్య పోటీలు, కథా సంపుటాలకు ఆహ్వానం, దివాకర్ల వేంకటావధాని జీవితం, సాహిత్యంపై సదస్సు...
పిల్లల బొమ్మల పుస్తకాల కోసం రచనలకు ఆహ్వానం
తానా – మంచి పుస్తకం ఆధ్వర్యంలో పదేళ్ళ లోపు పిల్లల కోసం తెలుగులో బొమ్మల కథల పుస్తకాలు – 2025 కోసం రచనలకు ఆహ్వానం. ఎంపిక ప్రక్రియ రెండు దశలు. మొదటి దశలో మొత్తం కథ, నమూనా బొమ్మలు మాకు 2025 మార్చి 31లోపు అందజెయ్యాలి. ఎంపికైన కథలు రెండవ దశలోకి వెళ్తాయి. ఈ దశలో సుమారు 5 కథాంశాలను ఎంపిక చేస్తాం. ఒక పుస్తకానికి కథ రాసిన వారికి, బొమ్మలు వేసిన వారికి రూ.15వేల చొప్పున పారితోషికం ఇస్తాం. 2025 మే 31లోపు బొమ్మలతో సహా ముద్రణకు సిద్ధంగా ఉన్న పుస్తకాన్ని అందజేయాలి. ఈ పుస్తకాలను తానా – మంచిపుస్తకం కలిసి 2025 జులై నాటికి ప్రచురిస్తాయి. మరిన్ని వివరాలకు: కె. సురేష్ (99638 62926), వాసిరెడ్డి నవీన్ (98483 10560). చిరునామా: మంచి పుస్తకం, 12–13–439, వీధి నెం.1, తార్నాక, సికింద్రాబాద్ 500017. ఈమెయిల్: info@manchipustakam.in.
కె. సురేష్
వేమన పద్య పోటీలు
వేమన పౌండేషన్, అనంత పురం ఆధ్వర్యంలో జనవరి 9లోగా వంద విద్యా సంస్థలలో వేమన పద్య పోటీలను నిర్వహిం చాలను కొన్నాం. ఎంపికైన విద్యా సంస్థ లకు ప్రసంశా పత్రాలు, పతకాలు, వేమన చిత్రం, పుస్తకా లు అంద చేస్తాం. ఆసక్తి ఉన్నవారు 99639 17187 నెంబరులో సంప్ర దించగలరు.
అప్పిరెడ్డి హరినాథరెడ్డి
కథా సంపుటాలకు ఆహ్వానం
కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం కోసం 2023లో ముద్రితమైన కథా సంపుటాలు మూడు ప్రతులను జనవరి 31, 2024 లోపు పంపాలి. బహుమతి పొందిన కథా సంపుటికి నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తరఫున ఏప్రిల్ నెలలో రూ.10వేల నగదు పురస్కారం, జ్ఞాపిక ప్రదానం జరుగును. ప్రతులు పంపే చిరునామా: పి. అబ్దుల్ వహీద్ ఖాన్, ఇంటి నెం. 15- 120/4/1, రహత్ నాగర్ కాలనీ, నాగర్ కర్నూల్ – 509209, ఫోన్: 9441946909.
వనపట్ల సుబ్బయ్య
దివాకర్ల వేంకటావధాని జీవితం, సాహిత్యంపై సదస్సు
సాహిత్య అకాడమీ, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో దివాకర్ల వేంకటావధాని జీవితం, సాహిత్యంపై సదస్సు డిసెంబర్ 31 ఉ.10 గంటల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి, రూమ్ నెంబర్ 121లో జరుగుతుంది. అధ్యక్షత సాగి కమలాకర శర్మ, కీలకోపన్యాసం శలాక రఘునాథ శర్మ, పత్ర సమర్పణ- అనుమాండ్ల భూమయ్య, సంగనభట్ల నరసయ్య, కసిరెడ్డి వెంకటరెడ్డి, పిల్లలమర్రి రాములు, జి అరుణకుమారి, గండ్ర లక్ష్మణరావు. కార్యక్రమంలో సి. మృణాళిని, సి. కాశీం, దివాకర్ల రాజేశ్వరి, ఏలే విజయలక్ష్మి, ఎస్. రఘు పాల్గొంటారు.
సి. మృణాళిని