ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 10 2024
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:38 AM
నవల, కథా సంపుటాలకు ఆహ్వానం, సురవరంపై కవితలకు ఆహ్వనం, తెలంగాణ సాహితి, ‘సుప్రభాత భావనలు’ వ్యాసాలు, గంటా కమలమ్మ పురస్కారం ...
నవల, కథా సంపుటాలకు ఆహ్వానం
గోవిందరాజు సీతాదేవి జాతీయ స్థాయి స్మారక సాహితీ పురస్కారం 2024 కొరకు 2023లో ప్రచురితమైన నవల ఇంకా కథా సంపుటులను ఆహ్వా నిస్తున్నాం. ఎంపికైన నవలకి, కథా సంపుటికి రూ.5వేల నగదు బహుమతితో పాటు సన్మానం జరుపబడును. మీ రచనలు ౩ కాపీలను డిసెంబర్ 31లోపు చిరునామా: గోవిందరాజు సుభద్రా దేవి, డోర్.నం. 26.15.494, స్నేహ నగర్, ప్రసాద్ అవెన్యూ, కొండయ్ పాలెం రోడ్డు, నెల్లోర్ – 524004, ఫోన్: 98486 27158కు పంపాలి.
గోవిందరాజు సుభద్రా దేవి
సురవరంపై కవితలకు ఆహ్వనం
ఆధునిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి మూర్తిమత్వంపై కవితలను ఆహ్వానిస్తున్నాం. అక్టోబర్ 30లోగా ఈ కవితలను 9492765358 నంబరుకు వాట్సాప్‌గానీ, vanapatlasubbaiah1972@gmail.comకు ఈమెయిల్ గానీ పంపగలరు. కవితలను నవంబర్ 2024లో సంకలనంగా ముద్రిస్తాం.
వనపట్ల సుబ్బయ్య
తెలంగాణ సాహితి
నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా సాహిత్య సమా లోచన - అక్టోబరు 8 ఉ.10గంటలకు నిర్వహించబడును. వి. భానుచందర్ అధ్య క్షతన నిర్వహించబడే కార్యక్రమంలో కోయి కోటేశ్వర్ రావు, తెలుగు శాఖాధిపతి, సిటీ కళాశాల హైదరాబాద్; వెంకట్ పరిమళ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ బి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల ప్రసంగిస్తారు. తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన పాల్గొంటారు. వివరాలకు: 94412 36242.
వి. భానుచందర్
‘సుప్రభాత భావనలు’ వ్యాసాలు
పొత్తూరి సుబ్బారావు ‘సుప్రభాత భావనలు’ వ్యాస సంపుటి అక్టోబర్ 8 సా.5.30 నుంచి జి.వి.ఆర్.కల్చరల్ ఫౌండే షన్ హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గాన సభ కళాసుబ్బారావు కళావేదికలో జరుగు తుంది. కార్యక్రమంలో కె.వి. రమణా చారి, పెద్దూరి వెంకటదాసు, రమణ వెలమకన్ని, కళా వి.ఎస్.జనార్దన మూర్తి, బైస దేవదాసు, వై. రామకృష్ణా రావు తదితరులు పాల్గొంటారు. పి.వి.ఎల్. నరసింహా రావు అతిథి సత్కారం చేస్తారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం జరుగుతుంది.
జి.వి.ఆర్. కల్చరల్ ఫౌండేషన్
గంటా కమలమ్మ పురస్కారం
గంటా కమలమ్మ సాహితీ పుర స్కారం- కోసం 2022, 2023 సంవత్స రాలలో ప్రచురితమైన కవితా సంపుటా లను ఆహ్వానిస్తున్నాము. మీ కవితా సంపుటాలు 3 ప్రతులను అక్టోబరు 15లోగా మాకు అందేలా పంపాలి. ఉత్తమ కవితా సంపుటానికి రూ.10వేలు నగదుతోపాటు, పురస్కార ప్రదానం జరుగుతుంది. చిరునామా: గంటా మోహన్, టీచర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బంగారు పాళ్యం, బంగారు పాళ్యం మండలం, చిత్తూరు జిల్లా - 517416. వివరాలకు: 9440467311
గంటా మోహన్