Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 9 12 2024

ABN , Publish Date - Dec 09 , 2024 | 12:57 AM

వర్తన ఆరవ సమావేశం, ‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’ కవిత్వ సంపుటి, రాయలసీమ మహాకవిసమ్మేళనం, ఉమ్మడిశెట్టి అవార్డు -2024...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 9 12 2024

వర్తన ఆరవ సమావేశం

వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఆరవ సమావేశం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో డిసెంబర్‌ 12 సా.6గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ‘తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం – ఆవశ్యకత - ఆచరణ’ అంశంపై సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి గుడిపాటి అధ్యక్షత వహిస్తారు.

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’ కవిత్వ సంపుటి

కుందుర్తి కవిత రాసిన కవిత్వ సంపుటి ‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’తో పాటు ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం పోటీ కవితల సంకలనం ‘ఆనవాళ్ళు’ పుస్తకాల ఆవిష్కరణ డిసెంబరు 14న రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో శివారెడ్డి, శిఖామణి, శీలా సుభద్రాదేవి, అనిల్ డ్యానీ, శ్రీరామ్, సమత పాల్గొంటారు.

ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలు


రాయలసీమ మహాకవిసమ్మేళనం

రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ మహాకవిసమ్మేళనం డిసెంబరు 15 తేదీన అనంతపురం లోని యస్.యస్.బి.యన్ కాలేజి ఆడిటోరియంలో జరుగుతుంది. రాయలసీమ ప్రముఖులపై 140 మంది కవులు కవితాగానం చేస్తారు. తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి, మెట్టుపల్లె సుదర్శనరెడ్డిల స్మారకంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. వివరాలకు: 99639 17187.

అప్పిరెడ్డి హరినాథరెడ్డి

ఉమ్మడిశెట్టి అవార్డు -2024

37వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు – 2024 కోసం కవుల నుండి కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము. 2024లో ప్రచురింప బడిన కవితా సంపుటాలు నాలుగు ప్రతులను జనవరి 10, 2025లోగా ఈ చిరునామాకు పంపాలి: రాధేయ, చైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్, 13–-1-–606–-1, షిర్డీ నగర్, రెవిన్యూ కాలనీ, అనంతపురం – -515001, ఫోన్‌: 9985171411. అవార్డు విజేతకు రూ.ఆరువేల నగదు, షీల్డ్ తో సత్కారం ఉంటుంది.

రాధేయ

Updated Date - Dec 09 , 2024 | 12:57 AM