ఈ వారం వివిధ కార్యక్రమాలు 01-07-2024
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:16 AM
విరసం ఆవిర్భావ సభ, ‘పండుటాకు’ కథా సంపుటి, ‘సముద్ర నానీలు’...
విరసం ఆవిర్భావ సభ
విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభ జూలై 4 ఉ.10గం.ల నుంచి సా.6గం.ల వరకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ‘వికసిత భారత్ ః హిందూ రాష్ట్ర’ అంశంపై ప్రసంగాలు ఉంటాయి. హెత్మామ్, వరలక్ష్మి, పాణి, రివేరా, అరసవిల్లి కృష్ణ, శివరాత్రి సుధాకర్, రాంకీ, రాము, సాగర్ మాట్లాడతారు.
రివేరా
‘పండుటాకు’ కథా సంపుటి
కాట్రగడ్డ దయానంద్ కథా సంపుటి ‘పండుటాకు - గుండ్లకమ్మ తీరాన’ ఆవిష్కరణ సభ జూలై 4 సా.6.30గం.లకు అన్నమయ్య కళావేదిక, శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం, బృందావన గార్డెన్స్, గుంటూరులో జరుగుతుంది. ఆవిష్కర్త పాపినేని శివశంకర్, అధ్యక్షత కందిమళ్ళ శివప్రసాద్. సభలో డి.ఎస్.వి.ఆర్. మూర్తి, వాసిరెడ్డి నవీన్, వి. ప్రతిమ పాల్గొంటారు.
మోదుగుల రవికృష్ణ
‘సముద్ర నానీలు’
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వహణలో కొక్కుల శివకృష్ణ ‘సముద్ర నానీలు’ పుస్తకావిష్కరణ జూలై 7 ఉ.10గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త ఎన్. గోపి; అధ్యక్షత సూర్యా ధనంజయ; విశిష్ట అతిథులు పోరెడ్డి రంగయ్య, కుడికాల వంశీధర్; గౌరవ అతిథులు సుంకరి కృష్ణ ప్రసాద్, చిత్తలూరి సత్యనారాయణ.
మద్దాళి రఘురాం