ఈ వారం వివిధ కార్యక్రమాలు 02 09 2024
ABN , Publish Date - Sep 02 , 2024 | 02:43 AM
‘పంపాతీరం’ నవల, చిల్లర భావనారాయణరావు శతజయంతి, కవి సంధ్య స్వర్ణోత్సవ సంచిక, సముద్రమ్మపై ప్రత్యేక సంచిక, ఉదారి నాగదాసు కవితా అవార్డు...
‘పంపాతీరం’ నవల
ఓల్గా రాసిన ‘పంపాతీరం’ పుస్తకం పరిచయ సభ సెప్టెంబర్ 8 ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని ఫిలిం భవన్‌లో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో జరుగనుంది. సి.వి. కుమార్ అధ్యక్షతన జరిగే సభలో నలిమెల భాస్కర్, ఓల్గా, బి.వి.ఎన్. స్వామి, పుప్పాల శ్రీరామ్, కందుకూరి అంజయ్య, గాజోజు నాగ భూషణం, తోట నిర్మల రాణి, దామరకుంట శంకరయ్య తదితరులు పాల్గొంటారు.
తెరవే, కరీంనగర్
చిల్లర భావనారాయణరావు శతజయంతి
చిల్లర భావ నారాయణ రావు శత జయంతి ప్రారంభోత్సవ సభ సెప్టెంబర్ 8 ఉదయం 10.30 గంటలకు భారతీయ విద్యాభవన్, 18, 20 & 22 మూడవ వీధి, మైలాపూర్, చెన్నైలో జరుగుతుంది. సభలో కిడాంబి లక్ష్మీకాంత్, చిల్లర భవానీదేవి, కమలాకర ఆనంద శివరామ్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 98844 46208.
తూమాటి సంజీవరావు
కవి సంధ్య స్వర్ణోత్సవ సంచిక
సెప్టెంబర్ 14 ఉదయం 10గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో ‘కవి సంధ్య’ 50వ సంచిక ఆవిష్కరణ సభ జరుగుతుంది. శివారెడ్డి, రమణాచారి, కె. శ్రీనివాస్, వాడ్రేవు చినవీరభద్రుడు, మామిడి హరికృష్ణ, దాట్ల దేవదానం రాజు, ఏనుగు నరసింహా రెడ్డి, కోయి కోటేశ్వరరావు, గూటం స్వామి పాల్గొంటారు. ఇదే సభలో నాగరాజు రామస్వామి ‘కవన కోకిలలు’ పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది.
శిఖామణి
సముద్రమ్మపై ప్రత్యేక సంచిక
తొలితరం దళిత మహాసభ ఉద్యమంలో పాల్గొన్న బహుజన సాంస్కృతిక యోధురాలు, గాయకు రాలు ఆతవ సముద్రమ్మపై ప్రత్యేక సంచిక తీసుకొస్తున్నాం. ఆమెపై మీ వ్యాసాలను, కవితలను సెప్టెంబరు 10లోగా యూనీకోడ్ ఫాంట్‌లో గానీ డీటీపీ చేసిన ఒపెన్ ఫైలు గానీ పంపగలరు. వివరాలకు: 96766 09234.
తంగిరాల సోని
ఉదారి నాగదాసు కవితా అవార్డు
ఉదారి నాగదాసు స్మారక కవితా అవార్డును ఈ ఏడాది బెల్లి యాదయ్య స్వీకరిస్తారు. ఈ అవార్డు ప్రదానం సెప్టెంబర్ 15న ఆదిలాబాద్‌లో జరుగు తుంది. అవార్డు కింద రూ.5వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రం ఇస్తారు. వివరాలకు: 94414 13666.
ఉదారి నారాయణ