Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15 04 2024

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:26 AM

అనుమంద్రం ఆవిష్కరణ సభ, కవిత్వంపై ముఖాముఖి, ఆత్మీయ సభ, నెచ్చెలి కథా, కవితా పోటీలు, కవిగాయక సమూహ గానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15 04 2024

అనుమంద్రం ఆవిష్కరణ సభ

రాళ్ళబండి శశిశ్రీ కవితా సంపుటి ‘అనుమంద్రం’ ఆవిష్కరణ సభ ఏప్రిల్‌ 17 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. తల్లావజ్ఝల శివాజీ, అనిల్‌ డ్యాని, కవి యాకూబ్‌, మామిడి హరికృష్ణ; వక్తలుగా- అంబటి సురేంద్ర రాజు, ఘంటశాల నిర్మల, సిద్ధార్థ పాల్గొంటారు.

బోధి ఫౌండేషన్‌

కవిత్వంపై ముఖాముఖి

అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ చైతన్య సాహితి సంయుక్త ఆధ్వర్యంలో వఝల శివకుమార్‌ కవిత్వం ‘వేళ్ళరహస్యం’తో ముఖాముఖి సమావేశం ఏప్రిల్‌ 20 సా.5గంటలకు ‘ముఖ్దుంభవన్‌’ హిమాయత్‌నగర్‌లో జరుగుతుంది.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

ఆత్మీయ సభ

బుర్రా లక్ష్మీనారాయణ సంస్మరణార్థం ఆత్మీయ సభ ఏప్రిల్‌ 15 సా.6గంటలకు సుందరయ్య కళానిలయం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, కె.వి.ఎస్‌.వర్మ, ఏనుగు నరసింహారెడ్డి, ఎం.నారాయణశర్మ, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొంటారు.

గుడిపాటి

నెచ్చెలి కథా, కవితా పోటీలు

నెచ్చెలి ఐదవ వార్షికోత్సవం (జూలై10, 2024) సందర్భంగా నిర్వహిస్తున్న ద్వితీయ కథా, కవితా పురస్కార పోటీలకు రచనలను ఆహ్వానిస్తున్నాం. కథలకు మొదటి, రెండవ, మూడవ బహు మతులు వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, రూ.1000. కవితలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ. 1500, రూ.1000, రూ.750. ఇతివృత్తం స్త్రీలకు సంబంధించిన అంశమై ఉండాలి. వర్డ్‌ ఫైల్‌లో కథలు పది పేజీలకు మించకుండా, కవితలు 2 పేజీలకు మించకుండా యూనికోడ్‌లో పీడీఎఫ్‌తో పాటు పంపాలి. ఈ-మెయిలు మీద ‘నెచ్చెలి - కథ - కవితల పోటీ - 2024కి’ అని రాసి ్ఛఛీజ్టీౌటఃుఽ్ఛఛిఛిజ్ఛిజూజీ.ఛిౌఝకు మే 10లోగా పంపాలి.

కె. గీత

కవిగాయక సమూహ గానం

దేశం ప్రమాదంలో ఉన్న ప్రస్తుత సందర్భంలో ‘ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కలం గళం ఎత్తు దాం!’ అనే నినాదంతో సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’ కార్యక్రమం ఏప్రిల్‌ 21 రాత్రి 9 గంటలకు దొడ్డి కొమురయ్య హాల్‌, సుందరయ్య భవన్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. మొత్తం పన్నెండు సెషన్లలో సభలు జరుగుతాయి. కె.శ్రీనివాస్‌, కె. శివారెడ్డి, పసునూరి రవీం దర్‌, గోరటి వెంకన్న, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, జయరాజు, కవి యాకూబ్‌, మాస్టార్జీ, మెర్సీ మార్గరెట్‌, సిద్ధార్థ, జ్వలిత, ప్రసేన్‌, నరేష్కుమార్‌ సూఫీ, నిజం, నాళేశ్వరం శంకరం, కోయి కోటేశ్వరరావు, కటుజోఝ్వల ఆనందాచారి, ప్రసాద మూర్తి, జూపాక సుభద్ర, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సీతారాం, ఏనుగు నర్సింహారెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొంటారు.

సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌

Updated Date - Apr 15 , 2024 | 12:26 AM