Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15 07 2024

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:57 AM

మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ పురస్కార ప్రదాన సభ, కరుణాకర్‌ స్మారకోపన్యాసం, తంగిరాల కృష్ణప్రసాద్‌ రంగస్థల పురస్కారం, కార్టూనిస్ట్‌ శేఖర్‌ పురస్కారం, పింగళి జగన్నాథరావు పురస్కారం, సింగిల్‌ పేజీ కథల పోటీ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 15 07 2024

మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ పురస్కార ప్రదాన సభ

మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ జాతీయ పురస్కారం (2024) ప్రదాన సభ జూలై 16 ఉ.11 గంటలకు హైదరాబాద్‌ లోని ప్రభుత్వ సిటీ కాలేజ్‌లో జరుగుతుంది. పురస్కారాన్ని అమ్మంగి వేణుగోపాల్‌ స్వీకరిస్తారు. సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి. బాల భాస్కర్‌ అధ్యక్షతన జరిగే సభలో ముదిగంటి సుజాతా రెడ్డి, యాకూబ్‌, వాహెద్‌, రాయారావు సూర్య ప్రకాశరావు అతిథులుగా పాల్గొంటారు. అవార్డు కమిటి కన్వీనర్‌ విప్లవ్‌ దత్‌ శుక్ల, సభ్యులు ఏలూరి యాదయ్య, జె రత్న ప్రభాకర్‌.

కోయి కోటేశ్వర రావు

కరుణాకర్‌ స్మారకోపన్యాసం

కరుణాకర్‌ 3వ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం, సంస్మరణ సభ జూలై 21 ఉదయం 10గంటలకు ఎల్‌బిజి హాల్‌, రంగారాయుడి చెరువు దగ్గర, ఒంగోలులో జరుగుతుంది. అధ్యక్షత రమాసుందరి. ‘నూతన విద్యా విధానం, సమాజంపై దాని ప్రభావం’ అంశంపై వేణుగోపాల్‌, ‘పర్యావరణ సంక్షోభం, రాజకీయ ఆర్థిక మూలాలు’ అంశంపై వరలక్ష్మి మాట్లాడతారు.

అరసవిల్లి కృష్ణ


తంగిరాల కృష్ణప్రసాద్‌ రంగస్థల పురస్కారం

25వ తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక రంగస్థల పురస్కారాన్ని సుఖమంచి కోటేశ్వరరావు స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం జూలై 21 సాయంత్రం 5 గంటలకు, ఠాగూర్‌ గ్రంథాలయం, విజయవాడలో జరుగుతుంది. ముఖ్య అతిథి వడ్డే శోభనాద్రీశ్వరరావు. 25 మంది సాహితీవేత్తలకు, కళాకారులకు సత్కారం ఉంటుంది.

తంగిరాల చక్రవర్తి

కార్టూనిస్ట్‌ శేఖర్‌ పురస్కారం

కార్టూనిస్ట్‌ శేఖర్‌ స్మారక పురస్కారం 2024 సంవత్సరానికి గాను తెలంగాణ టుడే కార్టూనిస్ట్‌ పి. నర్సిం ఎంపికయ్యారు. పురస్కార ప్రదానం జులై 21 ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. వివరాలకు: 9052116323

శేఖర్‌ కుటుంబ సభ్యులు

పింగళి జగన్నాథరావు పురస్కారం

సాహితీ కిరణం 15వ వార్షికోత్సవం సందర్భంగా పింగళి జగన్నాథ రావు స్మారక సాహిత్య పురస్కారాన్ని మరుమాముల దత్తాత్రేయ శర్మ, సిరిగాద నర్సయ్య స్మారక సాహిత్య పురస్కారాన్ని రమణ వెలమకన్ని, సిరిగాద బాలమ్మ స్మారక సాహిత్య పురస్కారాన్ని శైలజామిత్ర, గట్టుపల్లి చెంచురామారావు స్మారక ఆధ్యాత్మిక సాహిత్య పురస్కారాన్ని బండారుపల్లి రామచంద్రరావు స్వీకరిస్తారు. ఈ సభ జూలై 19న హైదరాబాద్‌ శ్రీ త్యాగరాయ గానసభ గుండవరపు హనుమంతరావు కళావేదిక నందు జరుగుతుంది. ముఖ్య అతిథి కె.వి. రమణ, సభాధ్యక్షులు గుదిబండి వెంకటరెడ్డి.

పొత్తూరి సుబ్బారావు


సింగిల్‌ పేజీ కథల పోటీ

వంశీ ఇంటర్నేషనల్‌ - సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న సింగిల్‌ పేజీ కథలకు సామాజిక స్పృహ గల కథలను పంపాలి. ఉత్తమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు. డిటిపిలో ఒక పేజీకి (ఫాంట్‌ 16, ఎ4సైజు) మించని, సామాజిక స్పృహ కలిగిన కథలను, జూలై 31లోగా చిరునామా: సాహితీ కిరణం, 11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌ - 500102, ఫోన్‌: 9490751681కు పంపాలి.

సాహితీ కిరణం

Updated Date - Jul 15 , 2024 | 01:57 AM