Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 09 2024

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:56 AM

తాటికొండాల సాహిత్య పురస్కారాలు, కాళోజీ పురస్కారం, ఉపాధ్యాయులతో జ్ఞాపకాలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 09 2024

తాటికొండాల సాహిత్య పురస్కారాలు

కథా రచయత, నాటక ప్రయోక్త, పరిశోధకుడు, నంది అవార్డు గ్రహీత తాటికొండాల నరసింహారావు సతీమణి తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కా రాల సభ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21 సాయంత్రం 6 గంటలకు దొడ్డి కొమరయ్య హాలు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరా బాద్‌లో జరుగుతుంది. 2023కి గాను ఎన్. గోపి, 2024కి గాను ప్రసేన్ పురస్కారాలను స్వీకరిస్తారు. సభలో నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, గౌరీశంకర్, సీతారాం, యాకూబ్, ఆనందా చారి, ఎస్‌. రఘు ప్రసంగిస్తారు. వివరాలకు: 95734 27422

వంశీకృష్ణ

కాళోజీ పురస్కారం

తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా అందించే కాళోజీ పురస్కా రానికి రాయా రావు సూర్యప్రకాశ్ రావు ఎం పికయ్యారు. మహ బూబ్ నగర్ లోని భారత్ స్కౌట్స్ భవనంలో సెప్టెం బర్‌ 22న జరిగే సభలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు.

రావూరి వనజ


ఉపాధ్యాయులతో జ్ఞాపకాలు

సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ ‘సంస్కృతి’ (గుంటూరు) ఉపాధ్యాయులపై ఒక ప్రత్యేక సంచికను ప్రచురించబోతున్నది. మీ ఉపాధ్యాయుల గొప్పతనాన్ని, మానవీయ కోణాన్ని తెలియచేసే సంఘటనలు, మీకు వారితో ఉన్న అనుబంధం గురించి రాసి 9440320580 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపితే, ప్రచురణార్హత ఉన్న వాటిని పుస్తక రూపంలో తెస్తాం.

యస్. బాలచందర్

Updated Date - Sep 16 , 2024 | 12:56 AM