ఈ వారం వివిధ కార్యక్రమాలు 19 08 2024
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:12 AM
దీపావళి కథల పోటీ, బెల్లంకొండ రామదాసు శత జయంతి సదస్సు, మినీకథల పోటీ...
దీపావళి కథల పోటీ
డాక్టర్ అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి రచయితలు తమకు నచ్చిన ఇతివృత్తంతో కథలు రాసి పంపాలి. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.10వేలు, రూ.6వేలు, రూ.4వేలు. మరో పది కథలకు రూ.1000 చొప్పున ప్రత్యేక బహుమతులు. కథలను సెప్టెం బర్ 25లోగా చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం: 3, బ్లాక్ -6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ –- 500044కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్: 9490099327 ఈమెయిల్: palapittabooks@gmail.com
గుడిపాటి
బెల్లంకొండ రామదాసు శత జయంతి సదస్సు
కేంద్ర సాహిత్య అకాడమీ, పల్నాడు కళా క్షేత్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న బెల్లంకొండ శత జయంతి సదస్సు ఆగస్ట్ 25న ఉ.10 నుంచి సా.5గంటల వరకు నరసరావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్‌లో జరుగుతుంది. సదస్సులో బెల్లం కొండ సాహిత్యంపై పత్ర సమర్పణ ఉంటుంది. సి. మృణాళిని, వేదాంతం సీతరామావధాని, సయ్యద్ నశీర్ అహ్మద్, రెంటలా జయదేవ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9966757407
కరీమ్
మినీకథల పోటీ
కీ.శే. భావరాజు సత్యన్నారాయణ మూర్తి 89వ జన్మదిన సందర్భంగా శ్రీమతి భావ రాజు రాజ్యలక్ష్మి (విశాఖపట్నం) ‘సాహితీ కిరణం’ పత్రిక సౌజన్యంతో మినీ కథల పోటీ నిర్వహిస్తున్నారు. మూడు ఉత్తమ కథలకు రూ.1,116/- చొప్పున మూడు నగదు బహుమతులు ఉంటాయి. కథ 250 నుండి 300 పదాల మధ్యలో డీ.టీ.పీ. చేసినవి కాని, చక్కని దస్తూరితో కాగితానికి ఒక వైపు వ్రాసినవి కానీ అయి ఉండాలి. కథలను ఆగస్ట్ 31లోగా చిరునామా: ఎడిటర్, సాహితీ కిరణం, ఇం.నెం.11-13-154, రోడ్ నెం.3, అలకాపురి, హైదరాబాద్–-500102. సెల్:9490751681కు పంపాలి.
పొత్తూరి సుబ్బారావు