ఈ వారం వివిధ కార్యక్రమాలు 21 07 2024
ABN , Publish Date - Jul 22 , 2024 | 03:45 AM
సింగిల్ పేజీ కథల పోటీ, కె. శివారెడ్డి కవిత్వ స్ఫూర్తి అవార్డు, మా కథలు 2023, ‘కాలం కత్తి మొన మీద’, కథలకు ఆహ్వానం...
సింగిల్ పేజీ కథల పోటీ
వంశీ ఇంటర్నేషనల్ 52 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో సింగిల్ పేజీ కథల పోటీలు నిర్వ హిస్తున్నది. మొదటి, రెండో, మూడో బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు. కథ డిటిపిలో ఒక పేజీకి మించరాదు (ఫాంట్ 16, ఎ4 సైజ్ మాత్రమే). ఎంపిక చేయ బడిన మరో 50కథలు అంటే మొత్తం 53 కథలను కలిపి వంశీ ఇంటర్నేష నల్ సంకలనంగా ప్రచురిస్తుంది. కథలు అందాల్సిన చివరి తేదీ జూలై 31. కథలు చేరాల్సిన చిరునామా: సాహితీ కిరణం, 11-13-154, అలకా పురి, రోడ్ నెం.3, హైదరాబాద్ - 500102. ఫోన్- 94907 51681.
పొత్తూరి సుబ్బారావు
కె. శివారెడ్డి కవిత్వ స్ఫూర్తి అవార్డు
‘కె. శివారెడ్డి కవిత్వ స్ఫూర్తి అవార్డు’కు 2023వ సంవత్సరానికి గాను ‘ఊహ చేద్దాం రండి’ కవితా సంపుటి వెలువరించిన కవి దొంతం చరణ్ ఎంపికయ్యారు. ఆగష్టు 18న ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది.
ఇబ్రహీం నిర్గుణ్
మా కథలు 2023
వేదగిరి రాంబాబు జయంతి సందర్భంగా, అక్టోబర్ 14న వెలువడనున్న మా కథలు 2023 సంకలనంలో ప్రచురణ కోసం 2023లో పబ్లిష్ అయిన కథలు పంపాలి. ఆఖరి తేదీ ఆగస్ట్ 15. చిరునామా: సి.హెచ్. శివరామ ప్రసాద్, కన్వీనర్, స్వగృహ అపార్ట్‌మెంట్, ‘సి’ బ్లాక్, జి-2, భాగ్యనగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్ - 500072. వివరాలకు ఫోన్: 9390085292.
శివరామ ప్రసాద్
‘కాలం కత్తి మొన మీద’
గార రంగనాథం కవిత్వ సంపుటి ‘కాలం కత్తి మొన మీద’ ఆవిష్కరణ సభ జూలై 28 ఉ.10గంటలకు విజయనగరం జిల్లా రాజాంలోగల విద్యానికేతన్ పాఠశాలలో పిల్లా తిరుపతి రావు అధ్యక్షతన జరుగుతుంది. సభలో బాల సుధాకర్‌మౌళి, సిరికి స్వామినాయుడు, కంచరాన భుజంగరావు అతిథులుగా పాల్గొంటారు.
రాజాం రచయితల వేదిక
కథలకు ఆహ్వానం
కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి మురళీ మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ దీపావళికి సైనికులు కథాంశంగా వెలువడనున్న కథా సంకలనంలో కోసం కథలను ఆహ్వానిస్తు న్నాం. సైనికుల పోరాట పటిమను, కర్తవ్య దీక్షను, త్యాగనిరతిని, దేశభక్తిని విభిన్న కోణాలలో ప్రతిబింబం చేసే కథలు పం పాలి. ఇదివరకు పత్రికలలో ప్రచురిత మైన కథలు కూడా పరిశీలిస్తాము. కొత్త కథలను సంచిక సాహిత్య వెబ్ పత్రికలో ప్రచురిస్తాము. కథలను అక్టోబర్ 31 లోగా చిరునామా: కస్తూరి మురళీ కృష్ణ, ఫ్లాట్ నెం.32, ఇం.నెం.8-48, రఘురాం నగర్ కాలనీ, దమ్మాయిగూడ, హైదరా బాద్ 500083కు లేదా ఈమెయిల్: sanchikastorycompilation@ gmail.comకు పంపాలి.
కస్తూరి మురళీకృష్ణ