ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 06 2024
ABN , Publish Date - Jun 24 , 2024 | 05:52 AM
కవితాసంపుటాల ఆహ్వానం, గీతమ్ పురస్కారం, వర్తన సమావేశం, ‘రేపటి మైదానం’ కవితా సంపుటి, పరిణత వాణి ప్రసంగం, శ్రీనాథ సాహిత్యంపై ప్రసంగం.....
కవితాసంపుటాల ఆహ్వానం
కె. శివారెడ్డి కవిత్వ స్ఫూర్తి పురస్కారం - 2024 కొరకు 2023లో ముద్రితమైన కవితా సంపుటాలు మూడు ప్రతులను జూలై 10 లోపు పంపాలి. కవి వయస్సు 35కు మించ రాదు. చిరునామా: ఇబ్రహీం నిర్గుణ్, 15.5. 112/1/బి, స్కైలైన్ టవర్స్ ఎదురుగా, చైతన్య నగర్, ఖమ్మం-507002. ఫోన్: 90636 96968.
ఇబ్రహీం నిర్గుణ్
గీతమ్ పురస్కారం
గీతమ్ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్తమ కవితా సంపుటాలు, కథా సంపుటాల పోటీకి 2016 - 2024 మధ్య విడుదలైన పుస్తకాలు మూడు ప్రతులను జూలై 5 లోగా పంపాలి. అత్యుత్తమ సంపుటికి రూ.10116/- నగదు, జ్ఞాపికతో పురస్కారం ఉంటుంది. చిరునామా: ఓలేటి వెంకటేశ్వర రావు, గీతమ్ సాహితీ సంస్థ, పిఠాపురం - 533450. వివరాలకు: 98483 98240.
ఓలేటి వెంకటేశ్వర రావు
వర్తన సమావేశం
వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అయి దవ సమావేశం జూన్ 25 సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో ‘తెలంగాణ నాటకం తీరుతెన్నులు’ అనే అంశంపై తాటి కొండాల నరసింహారావు ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహిస్తారు.
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
‘రేపటి మైదానం’ కవితా సంపుటి
ఎన్. గోపి 75వ జన్మదినం సందర్భంగా తాజా కవితాసంపుటి ‘రేపటి మైదానం’ ఆవిష్కరణ జూన్ 25 సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్. ఆడిటోరియంలో జరుగుతుంది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీని వాస్ ఆవిష్కరిస్తారు. వోలేటి పార్వతీశం అధ్య క్షత వహిస్తారు. సభలో రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి, సూర్యా ధనంజయ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్. రఘు, వంగల హర్షవర్ధన్ ఎస్. జతిన్ కుమార్, పుప్పాల శ్రీరామ్, జె. నీరజ పాల్గొంటారు.
కుడికాల వంశీధర్
పరిణత వాణి ప్రసంగం
తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో కవి, అనువాదకులు వై. ముకుంద రామారావు తమ జీవితం సాహిత్యంపై ప్రసంగించే ‘పరిణతవాణి’ కార్యక్రమం జూన్ 24 సాయంత్రం 5.30 నిమిషాలకు దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తిలక్ రోడ్, హైదరాబాద్‌లో జరుగుతుంది.
జె. చెన్నయ్య
శ్రీనాథ సాహిత్యంపై ప్రసంగం
రాజాం రచయితల వేదిక 113వ సమావేశం అల్తి మోహనరావు అధ్యక్షతన జూన్ 30 ఉదయం 10గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో విద్యా నికేతన్ పాఠశాలలో జరుగుతుంది. ‘శ్రీనాథ సాహిత్య విహంగ వీక్షణం’ అంశంపై నేతేటి గణేశ్వరరావు ముఖ్య ప్రసంగం చేస్తారు.
గార రంగనాథం