నివాళి
ABN , Publish Date - Oct 18 , 2024 | 02:45 AM
అమాయక జనాన్ని మాయాపాలకులే అన్యాయానికి గురిచేస్తుంటే ప్రశ్నించినందుకు, అడ్డుకున్నందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపక్షం వహించినందుకు ప్రతీకారంతో ప్రతీ వికారాన్ని ప్రదర్శిస్తూ మావోయిస్టుల ఆరో ప్రాణమనో...
అమాయక జనాన్ని
మాయా పాలకులే
అన్యాయానికి గురిచేస్తుంటే
ప్రశ్నించినందుకు, అడ్డుకున్నందుకు
ప్రజాస్వామ్యబద్ధంగా
ప్రజాపక్షం వహించినందుకు
ప్రతీకారంతో ప్రతీ వికారాన్ని ప్రదర్శిస్తూ
మావోయిస్టుల ఆరో ప్రాణమనో
ఆయన ఆరో ప్రాణం మావోయిస్టులనో
మోపిన ఆరోపణ చూస్తే
చంపదలచిన కుక్కకు
‘పిచ్చిద’నే ట్యాగేసినట్టుంది.
తొంభైశాతం దివ్యంగత్వాన్ని ధరించి
తన ఆరోగ్యాన్ని పట్టించుకోక
సాటి ఖైదీల హక్కుల్ని
తన హక్కుగా పట్టించుకున్న
సూర్యుడైనందుకు
పాలక మేఘాలు/ నిర్బంధ వర్షంతో
ఆర్పివేయ తడిపినై
ఆరోగ్యాన్ని మరింత/ కొల్లగొట్టి, చెడగొట్టి
ఆర్నెల్లకంటే ఎక్కువ కాలం
శరీరం మన్నకుండా చేసి
నిర్దోషిగా నిర్ణయించడం
ఈ ధర్మభూమిలో ధర్మప్రభువుల
కనికట్టు కనికరం.
బహుమతుల కోసమే
బహు మతులు
కలాన్ని, కాలాన్ని, సకలాన్ని
సమీకరించే మేధావులారా,
సకల జనుల కళాకారులారా,
సశస్త్ర సకలం యోధులారా,
ఆయన సకలల సాకారం కోసమే
అంజలి ఘటిద్దాం రండి!
డా. రాపోలు సుదర్శన్
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అరసం