Share News

విఘడియ

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:35 AM

మాను కింద నేను, పైన నక్షత్ర రాత్రి, నేనేవేవో గుబురు కలలు కంటూ, మన బుగ్గలు మీటుతూ సుతారంగా ఓ వీచిక,...

విఘడియ

మాను కింద నేను,

పైన నక్షత్ర రాత్రి,

నేనేవేవో గుబురు కలలు కంటూ,

మన బుగ్గలు మీటుతూ సుతారంగా ఓ వీచిక,

మన చేతిలో చేయి,

సమక్షానికి సరిపడిన ఓ పాటను కోరాను,

కానీ, మౌనమే నను చేరిన బదులు.

అప్పుడు సుతారంగా నా చెవులు నిమురుతూ,

చేరింది అంతే లలితంగా నీ లావణ్యం స్వరం.

బంగారం ఆ గాత్రం!

సుడులుగా సుందర గిరికీలుగా,

స్వర్గంలో నాకు పొందుపరచిన తమకంలా,

మధురమైన పాట నిలిచిపోయింది.

నీ తల నా ఎగు భుజాన వాలింది.

ఆ స్పర్శ నాకు ఈ నాటికీ ఎరుకే.

నేనది బాల్యంగా కోల్పోయి…నదే.

అప్పుడు అమ్మగా,

ఇప్పుడు నువ్వుగా,

అయినా నువ్వు అపరిచితవే నేటికీ,

అయినా నీ ప్రేమ అనిబంధనీయమే,

కాటుక ఆకాశంలో తళుకుల తార,

గాలికే రాలే ఎండుటాకులు

నగ్న పాదాలను తాకుతూ

అంతటా.


ఐంద్రజాల ఆవరణం.

దివి నుంచి వానగా చిలికే సుధ.

ఏం హేళ?

అమిత తన్మయమూ మట్టికరిపిస్తుంది కదూ!

అతి మంచీ భరించలేనిదిగా పరిణమిస్తుంది కదూ!

మన చంపల జమిలి

నాకు సుదీర్ఘ నిద్రను ప్రసాదిస్తుంది.

ఆ తేనె తెలి తుషారాలు,

ఏమిటనుకున్నావు?

అవి, వివేక సౌరభాలు!

ఈ ఘడియలే ముమ్మాటికి

నా బతికిన క్షణాలు.

ఇంగ్లీష్‌ మూలం : బి. నర్సింగరావు

తెలుగు అనువాదం : అనంతు చింతలపల్లి

Updated Date - Sep 30 , 2024 | 12:35 AM