Share News

వాహ్! ఉస్తాద్..!!

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:10 AM

రెండు తబలాలపై వినసొంపుగా నాట్యమాడే ఆ వేళ్ల నెమళ్లు ఎగిసెగిసి పడే హోరుగా కంటికింపుగా కదిలే జులపాల కెరటాలు...

వాహ్! ఉస్తాద్..!!

రెండు తబలాలపై

వినసొంపుగా

నాట్యమాడే ఆ వేళ్ల నెమళ్లు

ఎగిసెగిసి పడే హోరుగా

కంటికింపుగా

కదిలే జులపాల కెరటాలు

స్వరస్వర్గాలను

మనముందరే దించిన

జంత్రమాంత్రికుని

మూడు గుండెలు

మూగవోయినా

సుస్వరయాత్ర

సాగుతూనే ఉంది.


కవీ! ఎందుకా వ్యర్థప్రయత్నం

ఆ శబ్ద ఝరీగమనంలో

నీ మాటల ముఖాలు

చూసుకోవాలని

అజరామరమైన

ఆ నెమళ్లింకా

తబలాలపై

కనులముందు

ఆడుతూనే ఉన్నాయి

అశ్రువులు

వాహ్ ఉస్తాద్.. అల్విదా

అని చెబుతున్నా

చెవులింకా...

అబద్ధమనే అంటున్నాయి.

మడిపల్లి రాజ్‌కుమార్

Updated Date - Dec 18 , 2024 | 02:10 AM