AP 10th Results Update: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యేది అప్పుడే
ABN , Publish Date - Apr 17 , 2024 | 03:59 PM
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ ( Education ) రాసేసిన స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ ( Education ) రాసేసిన స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 25నే ఫలితాలు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే నెలాఖరుకు ఫలితాలు వెల్లడించేలా అధికారులు సిద్ధమవుతున్నారు.
Weather News: వెదర్ అలర్ట్.. ఆ రాష్ట్రాలకు వర్షాలు.. ఈ రాష్ట్రాలకు ఎండలు..!!
రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 6,30,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకనం ప్రారంభించి ఈ నెల 8తేదీతో పూర్తి చేశారు. గతేడాది మే 6న ఫలితాలు వెల్లడించామని అంతకంటే ముందే ఈ సంవత్సర వార్షిక ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్ దేవానంద్ చెప్పారు.
Elections 2024: ఎన్నికల ప్రక్రియలో ఒక ఓటరుపై ఎంత ఖర్చవుతుందో తెలుసా..
ఫలితాల విడుదల అనంతరం సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్లో చెక్ చేసుకునేలా అప్లోడింగ్ ప్రక్రియను చేస్తున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల హాల్టికెట్ ఎంటర్ చేసి, https://bse.ap.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. మార్కుల మెమోను తాత్కాలికంగా ఈ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈ ఏడాది కల్పిస్తున్నారు.
మరిన్ని చదువు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.