PM Internship Scheme: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ రోజే దరఖాస్తుకు లాస్ట్ డేట్
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:00 PM
నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024’ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిపోనుంది. నవంబర్ 10 చివరి తేదీగా ఉంది.నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MCA) ప్రారంభించింది.
నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024’ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిపోనుంది. నవంబర్ 10 చివరి తేదీగా ఉంది.నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MCA) ప్రారంభించింది. 2024లో లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడవసారి విజయం తర్వాత తొలి కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఈ పథకాన్ని ప్రకటించింది. హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యలో ఉత్తీర్ణత, ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్సిస్టిట్యూట్ నుంచి డిప్లొమా సర్టిఫికెట్లు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులుగా ఉన్నారు. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు పూర్తి సమయం ఉద్యోగం చేయని, పూర్తి సమయం విద్యకు కేటాయించని భారతీయ పౌరులు అయి ఉండాలి. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో చదివిన వారు కూడా అర్హులుగా ఉన్నారు.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (pminternship.mca.gov.in) సందర్శించవచ్చు. ఈ రోజే (ఆదివారం) గడువు తేదీ కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
దరఖాస్తు ఎలా చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in ఓపెన్ చేయాలి. రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. ముందుగా పేరు ఎంటర్ చేయాలి. అభ్యర్థులు అందించే సమాచారం ఆధారంగా రెజ్యూమ్ సిద్ధమవుతుంది. ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న ప్రాంతం, ఏ సెక్టార్, ఇంటర్న్‌షిప్ రోల్, విద్యార్హత వివరాలను పొందుపరచాలి. గరిష్ఠంగా 5 ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న తర్వాత ‘సబ్‌మిట్’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత నిర్ధారణ పేజీని ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఇక అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండాలి. కాగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల ప్రాధాన్యతలను బట్టి కంపెనీలు అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకుంటాయి. ఉపాధి తక్కువగా ఉండే ప్రాంతాలవారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది.