Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Feb 13 , 2024 | 07:59 PM
ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల పైచిలుకు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 9 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌లు సబ్మిట్ చేసేందుకు చివరి తేది ఏప్రిల్ 8.
వివరాలు..
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ -1100 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్ 3 -7900 పోస్టులు
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో నిర్వహిస్తారు. తొలి రెండు దశలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ టెస్టులు). మూడో దశలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, నాలుగో దశలో మెడికల్ టెస్టు ఉంటుంది.
సీబీటీ స్టేజ్ 1 పరీక్ష: జనరల్ ఎవేర్‌నెస్, మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు ఉంటాయి.
సీబీటీ స్టేజ్ 2: ఇందులో రెండు భాగాలు ఉంటాయి.
పార్ట్ ఏ: జనరల్ ఎవేర్‌నెస్, మ్యాథ్స్, రీజనింగ్
పార్ట్ బీ: సబ్జెక్ట్ సంబంధిత టెక్నికల్ ప్రశ్నలు
ఈ రెండు పరీక్షల్లో పాసైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు
జనరల్ అభ్యర్థులు (పురుష అభ్యర్థులు) - రూ.500
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ (పురుష అభ్యర్థులు) - రూ.250
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ (మహిళా/ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు ) - రూ.250
ఆన్‌లైన్‌లో చెల్లింపు