Share News

RRB NTPC 2024: ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్, అప్లై చేశారా

ABN , Publish Date - Oct 19 , 2024 | 08:07 PM

RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియ అక్టోబర్ 20తో ముగుస్తుంది. RRB NTPC దరఖాస్తు ఫారమ్‌ను నింపే ప్రక్రియను అక్టోబర్ 20కి పొడిగించారు. దరఖాస్తు రుసుమును ఈ నెల 21 నుంచి 22 వరకు చెల్లించవచ్చు.

RRB NTPC 2024: ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్, అప్లై చేశారా

ఇంటర్నెట్ డెస్క్: RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియ అక్టోబర్ 20తో ముగుస్తుంది. RRB NTPC దరఖాస్తు ఫారమ్‌ను నింపే ప్రక్రియను అక్టోబర్ 20కి పొడిగించారు. దరఖాస్తు రుసుమును ఈ నెల 21 నుంచి 22 వరకు చెల్లించవచ్చు. అక్టోబర్ 23 నుంచి మార్పులు చేసుకోవచ్చు. రుసుమును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఫీజు రాయితీ కేటగిరీలు మినహా అందరూ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500కాగా, PwBD/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/మాజీ సైనికులు/SC/ST/మైనారిటీలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు రూ. 250 చెల్లించాలి. కంప్యూటర్ బేస్‌డ్ పరీక్ష తరువాత దరఖాస్తు రుసుమును అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు. RRB NTPC పరీక్ష తేదీలను 2024లో ప్రకటిస్తారు.


దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండిలా..

  • RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • 'RRB NTPC Apply Online' లింక్‌పై క్లిక్ చేయండి

  • పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి వివరాలను ఎంటర్ చేయండి

  • రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్‌లు క్రియేట్ చేయాలి

  • అనంతరం RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి

  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

  • దరఖాస్తు రుసుము చెల్లించండి

  • RRB NTPC అప్లికేషన్ ఫారమ్ 2024 ప్రింటౌట్ తీసుకోండి

    ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే

Updated Date - Oct 19 , 2024 | 08:14 PM