TS SSC Results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల.. ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో ఫలితం
ABN , First Publish Date - Apr 30 , 2024 | 10:47 AM
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు-2024 ఫలితాలు (TS SSC Results) విడుదల కానున్నాయి. విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.
Live News & Update
-
2024-04-30T11:44:53+05:30
పది ఫలితాల రీకౌంటింగ్‌కు 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పుల చెల్లించాలని తెలిపారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు నిర్వహించనున్నామని బుర్రా వెంకటేశం ప్రకటించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
ఫలితాల కోసం
-
2024-04-30T11:27:43+05:30
తెలంగాణ పది ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా. 99.05%
చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 91.31 శాతం
27వ స్థానంలో మేడ్చల్ జిల్లా
30వ స్థానంలో హైదరాబాద్ జిల్లా
3927 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత
ఆరు ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత
-
2024-04-30T11:17:47+05:30
టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా టాప్.. వికారాబాద్ లాస్ట్
నిర్మల్ జిల్లా 99.05% ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది.
అతి తక్కువగా వికారాబాద్ జిల్లా 65.10% ఉత్తీర్ణత నమోదై చివరి స్థానంలో నిలిచింది.
-
2024-04-30T11:14:26+05:30
తెలంగాణ పది ఫలితాలను అందిస్తున్న అధికారిక వెబ్‌సైట్ల జాబితా ఇదిగో
1. http://results.bse.telangana.gov.in
-
2024-04-30T11:02:36+05:30
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు-2024 ఫలితాలు (TS SSC Results) విడుదలయ్యాయి. విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ రోజు (బుధవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. కాగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 మధ్య పరీక్షలు జరగగా సుమారు 4.93 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తున్న సెర్చ్ బార్‌లో హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు ఫలితం చిటికెలో వచ్చేస్తుంది.
పది ఫలితాల కోసం
-
2024-04-30T10:49:49+05:30
తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తున్న సెర్చ్ బార్‌లో హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు ఫలితం చిటికెలో వచ్చేస్తుంది.
10 ఫలితాల కోసం
-
2024-04-30T10:44:43+05:30
హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు-2024 ఫలితాలు (TS SSC Results) విడుదల కానున్నాయి. విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 మధ్య పరీక్షలు జరగగా సుమారు 4.93 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.