Share News

NTA: యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీల విడుదల.. చెక్ చేసుకోండిలా

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:55 PM

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ సెషన్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) - 2024 పరీక్ష తేదీలను శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్‌ను యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో ఉంచారు.

NTA: యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీల విడుదల.. చెక్ చేసుకోండిలా

ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ సెషన్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) - 2024 పరీక్ష తేదీలను శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్‌ను యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ లో ఉంచారు. యూజీసీ నెట్ జూన్ - 2024 పరీక్ష ఆగస్టు 21 - సెప్టెంబర్ 4 మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో జరుగుతుంది. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ NTA అధికారిక వెబ్‌సైట్‌లు ugcnet.nta.ac.in, nta.acలో అందుబాటులో ఉంటాయి.

నోటిఫికేషన్ ప్రకారం... పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి కేంద్రం వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లలోనే పరీక్ష కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.


తేదీల విడుదలతో పాటు, టెస్టింగ్ ఏజెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌లను షేర్ చేసింది. పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు 011-40759000 లేదా ఈ మెయిల్ ugcnet@nta.ac.inని కూడా సంప్రదించవచ్చు. పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేస్తూ ఉండాలని ఎన్టీఏ సూచించింది. మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్షల నిర్వహణ బాధ్యతను యూజీసీ ఎన్టీయేకు అప్పగించింది. కాగా జూనియర్‌ రిసెర్చ్ ఫెలోషిప్‌ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా రెండు సార్లు యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి విడతలో విడుదల చేసిన నెట్‌ నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తులు స్వీకరించారు.

పరీక్ష విధానం..

యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకుగానూ100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.


తెలంగాణ, ఏపీల్లో పరీక్ష కేంద్రాలు...

దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన నగరాలు, పట్టణాల్లో నెట్ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అనంతపురం, చిత్తూరు, అమరావతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, విజయనగరం సహా పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు తగినట్లు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

For Latest News and National News Click Here

Updated Date - Aug 02 , 2024 | 04:55 PM