Share News

Technology: దేశంలోనే తొలిసారిగా 'గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రాం..

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:16 PM

నేటి ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగానికి టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతోంది.

Technology: దేశంలోనే తొలిసారిగా 'గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రాం..
Google Cloud Gen AI

నేటి ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగానికి టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతోంది. అతి తక్కువ సమయంలో వేగంగా మనకు కావాలిసిన సమాచార సేకరణతో పాటు.. ఓ పనిని సులభతరంగా చేయడానికి ఏఐ ఉపయోగపడుతోంది. ఇప్పటికే సాంకేతిక రంగంలో ఏఐ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ఇప్పటివరకు ఏఐ ద్వారా టెక్స్ట్ సమాచారాన్ని మాత్రమే పొందగలుగుతున్నాం. కానీ గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ ప్రోగ్రాం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్‌ను ఉపయోగించి సెకన్ల వ్యవధిలో కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు.. ఇమేజ్ ఆధారంగానూ కంటెంట్‌ను సృష్టించే వీలుంటుంది. రానున్న రోజుల్లో ఏఐకి మరిన్ని మెరుగులు దిద్దనున్నారు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రాముఖ్యత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రాంపై అవగాహన కల్పించేందుకు గూగుల్ సంస్థ ప్రతినిధులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

3.jfif


తొలిసారిగా..

దేశంలో తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకాకాని వీవీఐటీ కళాశాలలో ఏర్పాటుచేసిన గూగుల్ క్లౌడ్ ల్యాబ్‌లో గూగుల్ సంస్థ ప్రతినిధులు 'గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రాం'ను ప్రారంభించారు. గూగుల్ కంపెనీకి చెందిన గూగుల్ క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్ శ్వేతా కొమ్మి నేని, ఎల్4జీ టెక్నికల్ హెడ్ ఆకాష్ సిన్హ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికతలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ ఏర్పాటుచేసిన గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ కార్యక్రమాన్ని ఎల్4జీ సంస్థ ద్వారా వీవీఐటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులకు అందించనున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా లక్షమందికి పైగా విద్యార్థులను జనరేటివ్ ఏఐ సాంకేతికతలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే సాంకేతికతను గూగుల్ సంస్థ విద్యార్థులకు అందించనుంది. రానున్న రోజులలో సాఫ్ట్‌వేర్స్ డెవలప్‌మెంట్‌లో మానవ శ్రమను జెన్ ఏఐ ఏవిధంగా తగ్గించగలదో విద్యార్థులకు వివరించారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న వివిధ కళాశాలలకు చెందిన 30 మంది ఆధ్యాపకులకు జెన్ ఏఐ ప్రోగ్రాం గురించి వివరించారు.

1.jfif


భవిష్యత్తు ఏఐదే ..

రానున్న రోజుల్లో ఏఐ ఎలాంటి పాత్రను సాంకేతిక రంగంలో పోషించనున్నదో తెలియజేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఇప్పటినుంచి ఏఐపై అవగాహన పెంచుకుని.. ఆరంగంలో నైపుణ్యాన్ని పెంచుకోవల్సిన అవసరాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడనున్నాయి. భవిష్యత్తులో ఏఐ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎంతోమంది నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో భవిష్యత్తు అంతా ఏఐదేనంటున్నారు.

2.jfif


భవిష్యత్తు ఏఐదే ..

రానున్న రోజుల్లో ఏఐ ఎలాంటి పాత్రను సాంకేతిక రంగంలో పోషించనున్నదో తెలియజేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఇప్పటినుంచి ఏఐపై అవగాహన పెంచుకుని.. ఆరంగంలో నైపుణ్యాన్ని పెంచుకోవల్సిన అవసరాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడనున్నాయి. భవిష్యత్తులో ఏఐ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎంతోమంది నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో భవిష్యత్తు అంతా ఏఐదేనంటున్నారు.

YS Jagan: జగన్‌ పత్రికకు జనం సొమ్ము

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:29 PM