Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?
ABN , Publish Date - Apr 23 , 2024 | 03:10 PM
లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls) నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సినిమా హీరో విక్టరీ వెంకటేశ్‌లకు వియ్యంకుడు అయిన రఘురామ రెడ్డి పేరుని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls2024) నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సినిమా హీరో విక్టరీ వెంకటేశ్‌లకు వియ్యంకుడు అయిన రఘురామ రెడ్డి పేరుని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినీ కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన కొడుకు యుగంధర్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం రఘురామ రెడ్డి వైపే మొగ్గుచూపింది.
హైదరాబాద్, కరీంనగర్ స్థానాల అభ్యర్థులు కూడా ఖరారు
ఖమ్మం లోక్‌సభతో పాటు హైదరాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్టు సమాచారం. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావుకు, హైదరాబాద్ సీటు నుంచి సమీర్ ఉల్లాకు టికెట్ కన్ఫామ్ చేసిందని తెలిసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. కాగా కరీంనగర్ నుంచి పోటీ చేయనున్న రాజేందర్ రావు, ఖమ్మం బరిలో నిలవనున్న రఘురామిరెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న సమీర్ రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.
సాయంత్రం 6 గంటలకు బీఫామ్‌లు అందజేత
టికెట్లు దక్కిన ఎంపీ అభ్యర్థులకు హస్తం పార్టీ బీ ఫామ్‌లు అందజేయనుంది. సాయంత్రం 6 గంటలకు గాంధీభవన్‌లో అభ్యర్థులకు ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీ అందించనున్నారు. మొత్తం 14 మంది అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. ముగ్గురికి మాత్రం రేపు (బుధవారం) అందజేయనున్న పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!
జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?
Read Latest Election News and Telugu News