Share News

Lok Sabha Election: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి

ABN , Publish Date - Apr 24 , 2024 | 09:10 PM

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని ప్రకటించింది.

Lok Sabha Election: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను ప్రకటించింది.


ఎవరీ రఘురామి రెడ్డి?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడే రఘురామి రెడ్డి. అంతేకాదు తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఈయనకు వియ్యంకుడే. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఆనుకొని ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి ఏకంగా నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగా ఆయన బలవంతుడే కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనవైపు మొగ్గుచూపిందట. తన సొదరుడు ప్రసాద్ రెడ్డికి కాకుంటే వియ్యంకుడు రఘురామి రెడ్డికి ఇవ్వాలంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎత్తుగడలు వేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పొంగులేటి కుటుంబ సభ్యులకు టికెట్‌ రాకుండా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనప్పటికీ చివరి రఘురామి రెడ్డి పేరు మాత్రం ఖరారయ్యిందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. కాగా ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఖమ్మం సీటును ఆలస్యంగా ప్రకటించినా ఏమీ కాదనే ఉద్దేశ్యంతో పార్టీ ఈ సీటు అభ్యర్థి విషయంలో తాత్సారం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 01:20 AM