Share News

AP Election 2024: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు

ABN , Publish Date - May 09 , 2024 | 01:28 PM

పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024లో విజేత ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆసక్తికరమైన సర్వే రిపోర్టును ప్రకటించారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఆయన అంచనా వేశారు.

AP Election 2024: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు
Gone Prakash Rao

విజయవాడ: పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Polls 2024) విజేత ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆసక్తికరమైన సర్వే రిపోర్టును ప్రకటించారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఆయన అంచనా వేశారు.


ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 సీట్లు ఉండగా కూటమి పార్టీలు 28 సీట్లకు తగ్గకుండా విజయం సాధిస్తాయని అంచనా వేశారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో 31 సీట్ల వరకు కూటమి గెలుచుకుంటుందని పేర్కొన్నారు. కృష్ణ-గుంటూరు జిల్లాల్లో మొత్తం 33 స్థానాలు ఉండగా 25 -29 సీట్ల వరకు కూటమి కొల్లగొడుతుందని విశ్లేషించారు. ఇక రాజధాని అమరావతి విషయంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయడంతో ఈ రెండు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు.


ఇక ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 22 అసెంబ్లీ సీట్లలో కూటమికి 15 సీట్లు తగ్గకుండా వస్తాయని గోనె ప్రకాశ్ లెక్కగట్టారు. కీలకమైన రాయలసీమలో 52 సీట్లు ఉండగా 24 సీట్ల వరకు కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశారు. మొత్తంగా చూస్తే 19 నుంచి 21 పార్లమెంట్ స్థానాలు, 125 - 143 అసెంబ్లీ స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందని గోనె ప్రకాశ్ విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి

జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్

లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్

ఎన్నికల వేళ రూ.8 కోట్లకుపైగా పట్టుబడిన నగదు

ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?

Read Latest Election News And Telugu News

Updated Date - May 09 , 2024 | 03:07 PM