Share News

ఏపీలోని ఆ 5 గ్రామాలు రాష్ట్రంలోకి..

ABN , Publish Date - May 04 , 2024 | 05:45 AM

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో భాగమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునఃప్రారంభం, ఐదు ఇండస్ట్రియల్‌ కారిడార్ల ఏర్పాటు.

ఏపీలోని ఆ 5 గ్రామాలు  రాష్ట్రంలోకి..

ఐటీఐఆర్‌ను పునఃప్రారంభిస్తాం

ఏపీలోని ఆ ఐదు గ్రామాలు రాష్ట్రంలోకి

విభజన హామీల అమలు

పారిశ్రామిక కారిడార్లు, విద్యా సంస్థల

ఏర్పాటు.. మేడారం జాతరకు జాతీయహోదా

లోక్‌సభ ఎన్నికలకు 23 అంశాలతో

తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫెస్టో

రాష్ట్రాభివృద్ధికే ఈ మేనిఫెస్టో: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మే 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో భాగమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునఃప్రారంభం, ఐదు ఇండస్ట్రియల్‌ కారిడార్ల ఏర్పాటు, విభజన హామీల అమలు, విద్యా సంస్థల ప్రారంభం, మేడారం జాతరకు జాతీయ హోదా తదితర 23 హామీలతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది.

పార్లమెంట్‌ ఎన్నికలకు రాష్ట్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, మంత్రి శ్రీధర్‌ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారెంటీలతో పాటు రాష్ట్రానికి ఇచ్చిన 23 ప్రత్యేక హామీలనూ అమలు చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే 23 అంశాలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పారు. రాహుల్‌ గాంధీని పప్పూ అంటూ మోదీ హేళన చేశారని, ఇప్పుడదే రాహుల్‌ను చూసి ఆయన భయపడుతున్నారని దీపాదాస్‌ మున్షీ అన్నారు. ప్రధాని స్థాయిని మరిచి ఎన్నికల ప్రచారంలో మోదీ చేస్తోన్న విమర్శలే అందుకు నిదర్శనమని తెలిపారు.

  • రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హామీలు ఇవే

మేడారం సమ్మక్క సారలమ్మ

జాతరకు జాతీయ హోదా

హైదరాబాద్‌ మహా నగరానికి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్వెస్ట్మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ప్రాజెక్ట్‌ పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్‌ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్‌ వర్సిటీల ఏర్పాటు

హైదరాబాద్‌- బెంగళూరు ఐటీ మరియు ఇండస్ట్రియల్‌ కారిడార్‌, హైదరాబాద్‌ - నాగపూర్‌, హైదరాబాద్‌ -వరంగల్‌, హైదరాబాద్‌ - నల్గొండ - మిర్యాలగూడ, సింగరేణి ఇండస్ట్రియల్‌ కారిడార్లుభద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం.


  • హైదరాబాద్‌లో నీతి అయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు

  • నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటు రామగుండం-మణుగూరు

  • నూతన రైల్వే లైన్‌ ఏర్పాటు

  • 4 నూతన సైనిక పాఠశాలలు

  • కేంద్రీయ విద్యాలయాల పెంపు

  • నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు

  • జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు

  • ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌

  • రీసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌) ఏర్పాటు

  • ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎ్‌ఫటీ) ఏర్పాటు

  • భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇరి) క్యాంపస్‌ ఏర్పాటు

  • నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు

  • అధునాతన వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్‌ పరిధిలో కేంద్ర

  • వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు

  • డ్రై పోర్టు ఏర్పాటు.

  • హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు

పాలమూరు - రంగారెడ్డి

ప్రాజెక్టుకు జాతీయ హోదా

ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు

73, 74వ

రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్‌లకు నేరుగా బదిలీ.

Updated Date - May 04 , 2024 | 05:49 AM