Skin Problems: వర్షాకాలంలో ఈ చర్మ సమస్యలు వస్తాయ్.. జాగ్రత్త
ABN , Publish Date - Aug 29 , 2024 | 12:38 PM
వర్షాకాలం మండే వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు అనేక చర్మ సమస్యలను కూడా తీసుకువస్తుంది. వాతావరణంలో పెరిగే తేమ శాతం ఈ సమస్యలకు కారణమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలం మండే వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు అనేక చర్మ సమస్యలను కూడా తీసుకువస్తుంది. వాతావరణంలో పెరిగే తేమ శాతం ఈ సమస్యలకు కారణమవుతుంది. ఈ కాలంలో ప్రధానంగా 5 రకాల చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
1. మొటిమలు
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. నూనె ఉత్పత్తి కావడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఏర్పడతాయి.
ఇంట్లోనే చికిత్స..
టీ ట్రీ ఆయిల్: కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయండి. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
తేనె, దాల్చిన చెక్క మాస్క్: ఒక చిటికెడు దాల్చిన చెక్కతో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడిగేయండి. ఈ ఫేస్ మాస్క్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడానికి సాయపడతాయి.
2. ఫంగల్ ఇన్ఫెక్షన్లు
సమస్య: వర్షాకాలంలో తేమ కారణంగా శరీరంపై శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది అథ్లెట్స్ ఫుట్, రింగ్‌వార్మ్, ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లలకు దారి తీస్తుంది.
ఇంట్లోనే చికిత్స..
వేప ఆకులు: వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీరు చల్లారాక శరీరానికి పెట్టుకోండి. వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
పసుపు పేస్ట్: పసుపు, నీటితో చేసిన పేస్ట్‌ను శరీరానికి రాయండి. ఇది ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సాయపడుతుంది.
3. తామర
తేమ స్థాయిల్లో హెచ్చుతగ్గులు తామర ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తాయి. దీని వలన చర్మం పొడిగా, దురదగా మారుతుంది.
ఇంట్లోనే చికిత్స..
ఓట్ మీల్ బాత్: స్నానపు నీటిలో ఒక కప్పు కొల్లాయిడ్ ఓట్ మీల్ వేసి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఓట్ మీల్ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె: శరీరానికి కొబ్బరి నూనెతో మర్దన చేయండి. ఇది మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. తద్వారా తామర మానుతుంది.
4. ప్రిక్లీ హీట్
వేడి, తేమ కలయిక ప్రిక్లీ హీట్ లేదా హీట్ ర్యాష్‌కు కారణమవుతుంది. ఇది దురదతో కూడిన ఎరుపు గడ్డలుగా కనిపిస్తుంది.
ఇంట్లోనే చికిత్స..
అలోవెరా జెల్: తాజా కలబంద జెల్‌ను ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయండి. కలబందలో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఇవి ప్రిక్లీ హీట్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
బేకింగ్ సోడా: ఒక కప్పు నీటిలో టీస్పూన్ బేకింగ్ సోడా కలపి, దద్దుర్లు ఉన్న చోట రాయండి. ఇది దురద, చికాకును తగ్గిస్తుంది.
5. చర్మ అలెర్జీలు
తేమతో కూడిన వాతావరణం చర్మ అలెర్జీలకు దారితీస్తుంది. ఎలెర్జీలతో చర్మం ఎర్రగా మారడం, దురద, దద్దుర్లు వస్తాయి.
ఇంట్లోనే చికిత్స..
యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కరిగించి, కాటన్ బాల్‌తో శరీరంపై అప్లై చేయండి. ఇది చర్మం pH ని సమతుల్యం చేయడానికి, అలెర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కోల్డ్ కంప్రెస్: దురద, మంటను తగ్గించడానికి ప్రభావిత ప్రాంతంలో తడి బట్ట లేదా ఐస్‌క్యూబ్స్‌తో రుద్దండి.
For Latest News click here