Bad Breath: నోరు కొంపు కొడుతుంగదా.. ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు..
ABN , Publish Date - Jun 17 , 2024 | 10:10 AM
నేటి ఆధునిక కాలంలో నోటి దుర్వాసన సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారు. రోజూ బ్రష్ చేస్తూ.. నోటిని శుభ్రం చేసుకుంటున్నా.. కొంతమంది ఈ రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన వల్ల మనకంటే పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు.
నేటి ఆధునిక కాలంలో నోటి దుర్వాసన సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారు. రోజూ బ్రష్ చేస్తూ.. నోటిని శుభ్రం చేసుకుంటున్నా.. కొంతమంది ఈ రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన వల్ల మనకంటే పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా పరిశుభ్రంగా ఉండకపోవడం.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నోటి దుర్వాసన వస్తుంది. దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల నోరు కొంపు కొడుతుంది. వెల్లులి, ఉల్లిపాయలు వంటి ఆహారాల్లో ఉండే దుర్వాసన గల నూనెలు.. ఊపిరితిత్తులకు చేరినప్పుడు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నోటి దుర్వాసన కలిగించకుండా ఉండే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం.
ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
పెరుగు
పెరుగులో ఫ్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి చెడు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నివారిస్తుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉండటంతో శరీరంలో క్రిములు పెరగడాన్ని తగ్గిస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. నోటి దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను ఇది తగ్గించడంతో పాటు బ్యాక్టిరియాను నిరోధిస్తుంది.
పండ్లు
నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టిరియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి సహాకరిస్తుంది. ఈ పండ్లు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
తులసి
తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనకు చికిత్స అందించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిని ఏ విధంగా తీసుకున్నా.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Read More Health News and Latest Telugu News