Share News

Health: వేడి నీటి స్నానాలతో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసా?

ABN , Publish Date - Nov 15 , 2024 | 10:16 PM

వేడి నీటి స్నానాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, తరచూ వేడి నీటి స్నానాలు చేస్తే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Health: వేడి నీటి స్నానాలతో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: వేడి నీటి స్నానాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, తరచూ వేడి నీటి స్నానాలు చేస్తే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వేడి ఎక్కువగా ఉన్న నీటితో చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి వేడి నీటి స్నానంతో వచ్చే సమస్యలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).

Health: రాత్రి లేటుగా నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామునే లేస్తున్నారా! అయితే..


వాస్తవానికి వేడి నీటి స్నానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా వేడినీటితోనాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ కూడా మెరుగయ్యేలా చేస్తుంది. అయితే, వేడి నీరు చర్మ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. జుట్టుపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ వేడి నీటి స్నానం చేస్తే చర్మం, జుట్టుపై ఉండే సహజసిద్ధమైన నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా అవి తేమ కోల్పోయి అందవిహీనంగా జీవరహితంగా కనిపిస్తాయి. అదే సమయంలో జుట్టు ఎక్కువగా పొడిబారితే అది ఊడిపోవడం కూడా ఖాయమని చెబుతున్నారు.

Recall Method: ఈ టెక్నిక్ ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం!

ఇక వేడినీటి స్నానంతో జుట్టుపై ఉండే సీబమ్ అనే కొవ్వు తొలగిపోతుంది. సీబమ్ జుట్టుకు రక్షణ ఇస్తుంది. తొలి తొలగిపోయిన పక్షంలో జుట్టు త్వరగా పాడై ఊడిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటి స్నానంతో బడలిక తొలగిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నీటి వేడి ఎంత ఎక్కువగా ఉంటే ప్రతికూల ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, బాగా చలిగా ఉందన్న కారణంతో మరీ వేడినీటి స్నానం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటితో అయితే చర్మం, కేశాల ఆరోగ్యం పదికాలాల పాటు నిలిచుంటుందని చెబుతున్నారు.


Powernaps: రోజూ మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!

ఇక చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గ్లిజరీన్ శాతం తక్కువగా ఉన్న సబ్బును వాడాలని కూడా వైద్యులు సూచిస్తు్న్నారు. దీంతో, స్నానం తరువాత చర్మం అతిగా పొడిబారకుండా ఉంటుంది. ఇక స్నానం తరువాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మానికి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని అంటున్నారు. చర్మం తేమ కోల్పోకుండా మాయిశ్చరైజర్ రక్షిస్తుందని అంటున్నారు.

Immunity Boosters for Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ ఇవే

Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..

Read Latest and Health News

Updated Date - Nov 15 , 2024 | 10:16 PM