Share News

Ghee - Skincare: చలికాలంలో నెయ్యిని ఇలా వాడితే అన్నీ బెనిఫిట్సే!

ABN , Publish Date - Dec 09 , 2024 | 09:28 PM

చలికాలంలో చర్మం పొడిబారి రకరకాల సమస్యలు వేధించడం సర్వ సాధారణం. అయితే, ఈ సమస్యకు నెయ్యితో చక్కని పరిష్కారం లభిస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

Ghee - Skincare: చలికాలంలో నెయ్యిని ఇలా వాడితే అన్నీ బెనిఫిట్సే!

ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో చర్మం పొడిబారి రకరకాల సమస్యలు వేధించడం సర్వ సాధారణం. అయితే, ఈ సమస్యకు నెయ్యితో చక్కని పరిష్కారం లభిస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. నెయ్యిలో పుష్కలంగా లభించే విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లతో చర్మానికి పూర్తి రక్షణ లభిస్తుందని అంటున్నారు. చర్మంలో తేమ శాతం, సున్నితత్వం పెరిగేలా చేసి నింగారింపు సంతరించుకునేలా చేస్తుందని చెబుతున్నారు (Health).

Health: 25 ఏళ్లు దాటిన మహిళలకు ఫుడ్‌లో ఈ విటమిన్స్ తప్పనిసరి!


నెయ్యితో ఉపయోగాలు..

నెయ్యి ఓ సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా తేమ శాతం పెరిగి చర్మంపై పొలుసులు లేవడం తగ్గుతుంది. పగుళ్లు కూడా మటుమాయం అవుతాయి. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం సున్నితంగా మారుతుంది. చిన్న చిన్న ముడతలు తొలగిపోతాయి. దీన్ని రెగ్యులర్‌గా వాడితే చర్మం కాంతిమంతం అవుతుంది. నెయ్యిలోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఎగ్జిమా, సోరియాసిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో, చర్మంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గి వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. పెదవుల పగుళ్లకు నెయ్యి గొప్ప పరిష్కారం. తరచూ నెయ్యిని ముఖానికి రాసుకునే వారు దీర్ఘకాలంలో రంగు తేలుతారు.

Dietary supplements: ఆహారంలో పోషకాల కొరతా? ఇలా చేస్తే సరి.. ప్రముఖ న్యూట్రిషనిస్టు సలహా


నెయ్యి వినియోగం ఇలా..

  • చేతిలో కొంచెం నెయ్యి తీసుకుని ముఖానికి శరీరానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. దీంతో, చర్మం మరింత మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

  • నెయ్యి లిప్ బామ్ లాగా వాడుకుంటే పెదవులపై పగుళ్లు మటుమాయం అవుతాయి. నెయ్యి కారణంగా పెదవులపై తేమ శాతం పెరిగి పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • నెయ్యితో ఫేస్ మాస్క్ కూడా చేసుకోవచ్చు. ఇందు కోసం రెండు చెంచాల నెయ్యిలో కొంచెం శనగ పిండి, పసుపు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లాగా ముఖానికి రాసుకోవాలి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖాన్ని కడిగేసుకోవాలి. నిత్యం ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

  • చర్మంపై మృతకణాలను తొలగించే బాడీ స్క్రబ్‌గా కూడా నెయ్యిని వాడుకోవచ్చు. ఇందుకోసం నెయ్యికి చక్కెర లేదా ఉప్పు జత చేసి ఈ మిశ్రమంతో చర్మంపై మర్దన చేయాలి. దీంతో, మృతకణాలు సులువుగా తొలగిపోతాయి.

Updated Date - Dec 09 , 2024 | 09:31 PM