Salt Water: రోజూ ఉప్పు నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!
ABN , Publish Date - Oct 29 , 2024 | 10:12 AM
ఉప్పు నీటితో పలు ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణంలో ఉండేవారికి, అతిగా చెమట పట్టేవారికి ఉప్పు నీరు బాగా ఉపయోగపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పు నీరు అనగానే అలా ఇబ్బంది పడకండి! నీటిలో తగినంత ఉప్పు వేసి ఓ క్రమపద్ధతిలో రోజూ ఈ నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Salt water).
ఉదయాన్నే పరగడుపున మంచి నీరు తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉప్పు నీటితో అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణంలో ఉండేవారికి, అతిగా చెమట పట్టేవారికి ఉప్పు నీరు బాగా ఉపయోగపడుతుంది.
Water Intoxication: అతిగా నీరు తాగుతున్నారా? వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలిస్తే..
శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను ఉప్పు నీరు సులువుగా పునరుద్ధరిస్తుంది. సోడియంతో పాటు పొటాషియం, క్లోరైడ్‌ల మధ్య సమతౌల్యం వస్తుంది. వీటితో పాటు నీరు కూడా తగినంత అందడటంతో నాడీకణాలు, కండరాల పనితీరు ఇనుమడిస్తుంది. కసరత్తులతో ఎలక్ట్రోలైట్స్ సమతౌల్యం చెదిరిన సందర్భాల్లో ఉప్పు నీరు అక్కరకు వస్తుంది. ఈ నీటితో చర్మ సంబంధిత సమస్యలైన ఎగ్జీమా, సోరియాసిస్ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఉప్పు నీరు తాగితే కడుపులో జీర్ణరసాలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు, పోషకాలు గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. ఉప్పు నీటి కారణంగా పేగుల్లోకి అదనంగా నీరు చేరి మలబద్ధకం వదిలిపోతుంది. క్రమంతప్పకుండా మలవిసర్జనకు ఆస్కారం ఏర్పడుతుంది.
Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!
ఉప్పు నీటిలో ఉండే వివిధ లవణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. దురదలు, దద్దుర్లు మొదలు పలు చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శాస్వకోస వ్యవస్థకు కూడా ఉప్పు నీటితో మేలు జరుగుతుంది. ఉప్పు నీరు పుక్కిళిస్తే గొంతు గరగర, జలుబు వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గి శ్వాసకోస వ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది.
ఉప్పు నీటికి డైయూరెటిక్ గుణం ఉంది. ఇది తాగితే మూత్ర విసర్జన అధికమవుతుంది. ఫలితంగా శరీరంలోని విషుతుల్యాలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది.
Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..
సాధారణ రిఫైన్డ్ ఉప్పుకు బదులు హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా సీ సాల్ట్‌తో ఉప్పు నీరు సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సోడియంతో పాటు ఇతర మినరల్స్ కూడా ఉంటాయి. సాధారణంగా ఇళ్లల్లో కనిపించే ఉప్పులో ఇవన్నీ ఉండవట. కప్పు నీళ్లల్లో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని తాగాలి. ఈ మోతాదు భరించలిగితే అర టీస్పూను ఉప్పు కూడా వేసుకోవచ్చు. అయితే, ఉప్పు నీరు ఇబ్బంది పెడుతోందని అర్థం కాగానే దాని మోతాదును తగ్గించాలి. ఇందుకు కోసం నిరంతరం శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు.