Share News

Coconut: ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:51 PM

ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. డయాబెటిస్‌పై అదుపు, డీహైడ్రేషన్ నుంచి విముక్తి వంటి అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.

Coconut: ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరితో ఎన్నో ఉపయోగాలు (Health) ఉన్న విషయం తెలిసిందే. ఇక కొబ్బరి నీళ్లతో డీహైడ్రేషన్ తొలగిపోవడంతో పాటు ఎలక్ట్రోలైట్స్‌ సమతౌల్యం చేకూరుతుంది. అయితే, ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు (Benefits of eating coconut in the morning). అవేంటంటే..

Protect your Hearing: మీ వినికిడి శక్తి కలకాలం నిలిచుండాలంటే ఇలా చేయండి!

డయాబెటిస్‌పై అదుపు..

న్యూట్రిషనిస్టులు చెప్పేదాని ప్రకారం, ప్రతి 55 గ్రాముల పచ్చికొబ్బరిలో 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 42. దీంతో, కొబ్బరిలోని కార్బోహైడ్రేట్లను శరీరం నెమ్మదిగా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోస్ స్థాయి అదుపులో ఉంటుంది. కొబ్బరిలోని మాంగనీస్, మెగ్నీషియమ్, విటమిన్ సీ, ఎల్- ఆర్జినైన్ వంటివన్నీ టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో తోడ్పాటునందిస్తాయి.

సులువుగా బరువుతగ్గొచ్చు..

కొబ్బరిలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దీంతో, కొబ్బరి తిన్నాక చాలా సేపు కడుపు నిండుగా అనిపించి మరేమీ తినబుద్ధి కాదు. దీంతో, బరువు దానంతట అదే అదుపులో ఉంటుంది. అయితే, కొబ్బరిలో కెలొరీలు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని, కాబట్టి దీన్ని కూడా మితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు.

Tea-biscuit: ఉదయాన్నే టీ బిస్కెట్‌ తింటే రిస్క్ అని తెలుసా?


మలబద్ధకం నుంచి విముక్తి

మలబద్ధకానికి కొబ్బరితో ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం కారణంగా పేగుల్లో కదలికలు పెరిగి మలవిసర్జన సాఫీగా సాగిపోతుంది.

రోగనిరోధక శక్తి బలోపేతం

కొబ్బరిలో సెలీనియం, గాలిక్ యాసిడ్, కేఫిక్ యాసిడ్, కొమారిన్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీంతో, రోగనిరోధక శక్తి బలోపేతమై అంటువ్యాధుల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. కొబ్బరిలోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులకు యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ రోగాలను దరిచేరనివ్వవు.

Viral: కుర్చిలో కూర్చునే పొట్టచుట్టూ కొవ్వు కరిగించుకోవచ్చు! ఎలాగంటే..


డీహైడ్రేషన్ నుంచి విముక్తి

డీహైడ్రేషన్ నుంచి విముక్తి పొందేందుకు నీటి తరువాత అంతటి మెరుగైనది కొబ్బరి నీరే! వాంతులు, విరేచనాలు, అతిగా చెమట పట్టడం వంటివాటితో శరీరంలో కోల్పోయిన లవణాలన్నీ కొబ్బరి నీటితో తిరిగి లభిస్తాయి.

కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని తినొచ్చు. ఇది నచ్చని వారు కొబ్బరి తురుమును కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొబ్బరి తురుమును బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Sep 24 , 2024 | 04:51 PM